విశ్వ హిందూ పరిషత్ మంథని ప్రకండ భజరంగ్ దళ్ నూతన కమిటీ నియామకం సోమవారం మంథని లో చేపట్టారు. ముఖ్య అతిథులుగా హాజరైన విశ్వ హిందూపరిషత్ కరీంనగర్ విభాగ్ కార్యదర్శి అయోధ్య రవీందర్, పెద్దపల్లి జిల్లా భజరంగ్ దల్ సంయోజక సంపత్ యాదవ్ ల సమక్షంలో విశ్వ హింద్ పరిషత్ పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షులు కొత్త శ్రీనివాస్ గుప్తా నూతన భజరంగ్ధల్ కమిటీని ప్రకటించారు‌. మంథని ప్రకండ భజరంగ్ధల్ సంయోజక్ గా నరేడ్ల రాజేష్, సహా సంయోజకులుగా జెంబోజు సాయి, భోగే సందీప్, గోరక్షా ప్రాముఖ్ తోగరి రాజ్ కుమార్, సురక్షా ప్రాముఖ్ ఎడ్ల ఉమేశ్, బలోపాసన కేంద్ర జెంగపల్లి అభిషేక్, అకాడ ప్రముఖ వడ్ల కొండ శ్రావణ్, విద్యార్థి ప్రాముఖ దేవాంశ్, సభ్యులుగా తాటి రాము, రాంబాబు, ఎరుకల రాజేష్, తేజు రమేష్, ఈ కార్యక్రమం లో విశ్వ హిందూ పరిషత్ మంథని ప్రకండ అధ్యక్షులు రావుల సతీష్, ఉపాధ్యక్షులు బోట్ల ఆంజనేయులు, సత్సంగ్ ప్రాముఖ్, కొమురవెల్లి హరిష్, సహకార్యదర్శి గుండా శ్రీనివాస్, ఎల్లంకి హరి మందిర్మట్, మెడగొని రాజమౌళి గౌడ్, పరిషత్ సభ్యులు,  మాలా స్వాములు, హిందూ బంధువులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, హిందూ ధర్మ పరిరక్షణ, సేవా కార్యక్రమాలు, సమాజ ఐక్యత కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పెద్దలు సూచించారు.

మంథని ప్రకండ భజరంగ్ దళ్ కమిటీ నియామకం