ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగుల పంపిణీ చేసిన ఎంపీ...
తెలంగాణ చీఫ్ బ్యూరో( కొండపర్తి ప్రసన్నకుమార్) అక్టోబర్ 26 :-
పెద్దపెల్లి జిల్లా మంథని నియోజకవర్గంలోని కొయ్యూరు ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు.
విద్యార్థులను ప్రోత్సహించడం, వారికి అవసరమైన విద్యా సామగ్రిని అందించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ విద్యార్థులతో ముచ్చటించి, వారు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
విద్యార్థుల భవిష్యత్తుకు అండగా నిలవడం, విద్యా రంగ అభివృద్ధికి తోడ్పడటం ఎంతో ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. విద్యార్థుల్లో చదువుపట్ల ఆసక్తిని పెంపొందించేందుకు ఇలాంటి సేవా కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు.విద్యార్థుల అభ్యున్నతికి, గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని ఎంపీ పేర్కొన్నారు. ఆయన వెంట అధికారులు నాయకులుకార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగుల పంపిణీ చేసిన ఎంపీ...
ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగుల పంపిణీ చేసిన ఎంపీ...
లోకల్ యాడ్స్
వార్తా విభాగం: తెలంగాణప్రచురణ తేదీ: 26 October 2026 07:40 PM
K Prasanna Kumar




