డబుల్ బెడ్ రూంలో ఇప్పించాలని అదనపు కలెక్టర్ కు వినతి...
 తెలంగాణ చీఫ్ బ్యూరో( కొండపర్తి ప్రసన్నకుమార్) అక్టోబర్ 26:-
బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆనాటి కలెక్టర్ లాటరీ పద్ధతి ద్వారా 330 మంది డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగిందని,
 కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లబ్ధిదారులకు ఇల్లను కేటాయించకుండా కాలయాపన చేస్తుందని, గతంలో మేము డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు కేటాయించాలని ఇచ్చిన దరఖాస్తులకు కు ఎలాంటి స్పందన రాలేదని  ఇప్పటికైనా వెంటనే 330 మంది డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు వెంటనే ఇళ్లను కేటాయించాలనీ కోరుతూ సోమవారం ప్రజావాణిలో అదనపు కలెక్టర్ రాములు కు వినతిపత్రం అందజేశారు.
అదేవిధంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం తీసిన లాటరీలో పూర్తిగా అవినీతి జరిగిందని ఇళ్ల కోసం దాదాపు 17 వేలు అప్లికేషన్లు వస్తే అందులో కేవలం 807 మందిని ఎలా గుర్తించారు చెప్పాలని మరియు 807 లబ్ధిదారుల లిస్టును బహిర్గతం చేయాలని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ కు అందజేసిన  వినతి పత్రం లో పేర్కొన్నారు. వినతి పత్రం అందజేసిన వారిలో  కార్పొరేటర్ అబ్దుల్ సత్తార్,పెట్టం స్వరూప-లక్ష్మణ్,గుమ్మడి శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు పోరెడ్డి రాజు,వంగ తిరుపతి,తోట తిరుపతి  మరియు నాయకులు పడాల రవీందర్,బల్లికొండ రమేష్ లు ఉన్నారు.