ఆదివాసీల ఆరాధ్య దైవం కొమరం భీమ్...
మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్..
తెలంగాణ చీఫ్ బ్యూరో( కొండపర్తి ప్రసన్నకుమార్) అక్టోబర్ 26 :- జల్ జంగిల్ జమీన్ కోసం ప్రాణాలు త్యాగం చేసిన పోరాట వీరుడు కొమరం భీమ్ అని ఆయన సేవలు ఆదివాసీలతో పాటు ప్రజలు ఎప్పుడు కూడా మర్చిపోలేరని మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ లు తెలిపారు. సోమవారం కొమరం భీమ్ 86వ వర్ధంతిని పురస్కరించుకొని జోడేఘాట్లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆదివాసీల సంక్షేమం కోసం అతడు చేసిన త్యాగాలు ఆశయాలను మరోసారి స్మరించుకున్నారు. ఆదివాసీల హక్కుల కోసం బ్రతుకునంతవరకు వీరోచిత పోరాటం చేసిన గొప్ప మనసున్న మహానీయుడు అన్నారు. ప్రస్తుతం ఆదివాసీలకు అన్ని రకాల సంక్షేమ పథకాలతో పాటు అన్ని హక్కులు అందుతున్నాయి అంటే అతని పోరాట ఫలితమే అన్నారు. అంతేకాకుండా ప్రభుత్వాలు సైతం కొమరం భీమ్ కు మంచి గుర్తింపునిచ్చి ఆయన వర్ధంతి, జయంతులను అధికారికంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పాల్వాయి హరీష్ రావు, కోవలక్ష్మి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండేవిటల్, మరో కోదండరాం తో పాటు డిసిసి అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్కమాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు , ఆదివాసి నాయకులు, కలెక్టర్ హరిత, ఎస్పీ నీతికాపంత్ , పోలీస్, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

K Prasanna Kumar





