భూ రీ సర్వే పనుల నిర్వహణ కొరకు రోవర్ల కొనుగోలుకు చర్యలు తీసుకుంటాం..
 అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు..
తెలంగాణ చీఫ్ బ్యూరో( కొండపర్తి ప్రసన్నకుమార్) అక్టోబర్ 26:-
భూ రీ సర్వే పనుల నిర్వహణ కోసం అవసరమైన జిఎన్‌ఎస్‌ఎస్ రోవర్ పరికరాల కొనుగోలుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంచిర్యాల  జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు తెలిపారు. సోమవారం మంచిర్యాల  జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో గల అదనపు కలెక్టర్ ఛాంబర్ లో సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఎ.డి. శ్రీనివాస్ తో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రీ సర్వే ప్రక్రియలో అవసరమైన రోవర్ల కొనుగోలు కొరకు ఈ.ఓ.ఐ. ప్రక్రియ ద్వారా ఆసక్తిగల సంస్థల వివరాలు పరిశీలించడం జరుగుతుందని తెలిపారు. భూ రీ సర్వే పనులకు అవసరమైన సాంకేతిక ప్రమాణాలు, పరికరాల పనితీరు తదితర అంశాలకు పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. భూ రీ సర్వే పనులను మరింత ఖచ్చితత్వంతో, పారదర్శకంగా నిర్వహించేందుకు ఆధునిక సర్వే సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడంపై అధికారులు దృష్టి సారించాలని తెలిపారు.అనంతరం పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ శ్రీకళ తో కలిసి అధికారులు, రైస్ మిల్లర్ల సంఘం ప్రతినిధులతో సి ఎం ఆర్ డెలివరీ పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని రైస్ మిల్లులకు సంబంధించిన సిఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) బియ్యం పంపిణీలో మిగిలి ఉన్న డెలివరీలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని తెలిపారు. బకాయిలు చెల్లించని డిఫాల్ట్ రైస్ మిల్లర్ల నుంచి రావాల్సిన బకాయి మొత్తాల రికవరీ ప్రక్రియను వేగవంతం చేసి, పెండింగ్ బకాయిలను వెంటనే క్లియర్ చేయాలని సూచించారు. సిఎంఆర్ లక్ష్యాల సాధనలో ఎలాంటి జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధితఅధికారులు తదితరులు పాల్గొన్నారు.