భూ పరిపాలన పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం వేగవంతం చేయాలి...
భూ పరిపాలన ప్రధాన కమిషనర్ లోకేష్ కుమార్..
తెలంగాణ చీఫ్ బ్యూరో( కొండపర్తి ప్రసన్నకుమార్) అక్టోబర్ 12:-
భూ పరిపాలన పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం వేగవంతం చేయాలని భూ పరిపాలన ప్రధాన కమిషనర్ లోకేష్ కుమార్ సూచించారు. సోమవారం హైదరాబాద్ నుండి ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంబంధిత అధికారులతో ప్రభుత్వ భూములలో ఉన్న అర్హమైన ఖాళీ స్థలాలు, ఇండ్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్, పట్టణ భూ గరిష్ఠ పరిమితి, భూములక్రమబద్ధీకరణ దరఖాస్తులు, సింగరేణి బొగ్గు గనుల పరిధిలోని భూ సంబంధిత పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం, జీ.ఓ. నెం.59కుసంబంధించిన మార్గదర్శకాల అమలుపై సమావేశం నిర్వహించి, గ్రామాల రీ-సర్వే పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా భూ పరిపాలన ప్రధాన కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వ మెమోల ప్రకారం పెండింగ్ దరఖాస్తుల పరిశీలన, అర్హత కలిగిన దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ, నిర్దేశిత నిబంధనలు, కోర్టు ఆదేశాలకు అనుగుణంగా తీసుకోవలసిన చర్యలు, గ్రామాల రీ-సర్వే పనుల పురోగతి ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపారు. భూముల రీ సర్వే ప్రక్రియలో భాగంగా సర్వే బృందాలను ఏర్పాటు చేసి, తగు శిక్షణ అందించాలని, నాయబ్ తహసిల్దార్ నుండి జూనియర్ అసిస్టెంట్ వరకు సర్వే విధానం, పరికరాల ఉపయోగం పై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ప్రభుత్వ భూములలోని అర్హమైన ఖాళీ స్థలాలు, ఇళ్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలని సూచించారు. యుఎల్సి, భూముల క్రమబద్ధీకరణకు సంబంధించిన పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని తెలిపారు. సింగరేణి బొగ్గు గనుల పరిధిలోని భూ సంబంధిత పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంలో ప్రభుత్వ ఆదేశాలు, నియమ నిబంధనలనుపాటించాలని సూచించారు. జి.ఓ.నెం.59కు సంబంధించిన మార్గదర్శకాల అమలను అమలు చేయాలని తెలిపారు. దరఖాస్తుల పరిష్కారంలో ప్రభుత్వ మార్గదర్శకాలు, సంబంధిత చట్టాలు, నిబంధనలు, కోర్టు ఆదేశాలను అమలు చేయాలని తెలిపారు.మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు మాట్లాడుతూ భూముల రీ సర్వే, అర్హమైన ఖాళీ స్థలాలు, ఇండ్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్, పట్టణ భూ గరిష్ఠ పరిమితి, భూముల క్రమబద్ధీకరణ దరఖాస్తులు, సింగరేణి బొగ్గు గనుల పరిధిలోని భూ సంబంధిత పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం, జీ.ఓ. నెం.59 అమలులో ప్రభుత్వ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ సందర్భంగా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఎ.డి. శ్రీనివాస్, బి-సూపరింటెండెంట్ అతీష్,డి-సూపరింటెండెంట్కవిత,సంబంధిత అధికారులుతదితరులు పాల్గొన్నారు.
K Prasanna Kumar





