ప్రజా శ్రేయస్సు కోసం ప్రత్యేక పూజలు చేసిన మంతెన జగన్మోహన్..
తెలంగాణ చీఫ్ బ్యూరో (కొండపర్తి ప్రసన్నకుమార్) అక్టోబర్ 13 :-
లక్సెట్టిపేట మండలంలో పలు ఆలయాల్లో నవరాత్రుల్లో భాగంగా కొలువుదీరిన దుర్గామాత అమ్మవారిని సోమవారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుమంతెన జగన్ మోహన్ రావు దర్శించుకుని పూజలు చేశారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో ఆప్యాయంగా మమేకమై, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటూ, మంచి చెడులను చర్చిస్తూ ప్రజలతో తనకున్న అనుబంధాన్ని చాటుకున్నారు.ప్రజల మధ్యే ప్రయాణం చేస్తానని ప్రజల కోసమే ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా పనిచేస్తానన్నారు.తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్న తరుణంలో ప్రజల ఆకాంక్షలను తెలుసుకుంటూ, వారి సమస్యలను అర్థం చేసుకుంటూ ప్రజాసేవే పరమావధిగా ముందుకు సాగుదాం అన్నారు. అందరూ కలిసికట్టుగా ఉంటే సాధించలేనిది ఏది ఉండదన్నారు. అనంతరం పార్టీ స్థితిగతులపై చర్చించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులుకార్యకర్తలు పాల్గొన్నారు.
K Prasanna Kumar





