జయశంకర్ భూపాలపల్లి ప్రతినిధి. కాటారం మండలం, గారేపల్లి గ్రామంరైతు గౌరోజు శంకరయ్య చేనును  ‘కావేరి బంపర్’ పత్తిని ఆ కుంపటి ప్రతినిధులు క్షేత్ర ప్రదర్శన చేశారు. నిర్వాహకులు కావేరి సీడ్స్. ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ కావేరి బంపర్’ ప్రత్యేకతలు అధిక దిగుబడి పెద్ద సైజు కాయలు, ప్రతి కాయలో సాధారణంగా 5.గదులు ఉండటం వల్ల దిగుబడి, తూకం పెరుగుతుంది. పురుగుల నివారణ, ఆకులపై ఉండే రోమాల వల్ల రసం పీల్చే పురుగుల ప్రభావం తగ్గుతుంది. వాతావరణాన్ని తట్టుకునే శక్తి వర్షాభావ పరిస్థితులు, అధిక ఉష్ణోగ్రతలను తట్టుకుని తేమను నిలుపుకుంటుంది. సాగు అనుకూలత సాలు పత్తి మరియు డబ్బా పత్తి సాగు రెంటికీ అనుకూలం. నేల స్వభావం, నీటి లభ్యత స్థానిక వాతావరణ పరిస్థితులను బట్టి విత్తనాలను ఎంపిక చేసుకోవాలని సేల్స్ ఆఫీసర్ రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సేల్స్ ఆఫీసర్ కవి కుమార్, ఫీల్డ్ స్టాఫ్ సమ్మయ్య, స్థానిక రైతులు, గ్రామ పెద్దలు. పాల్గొన్నారు.

గారేపల్లిలో ‘కావేరి బంపర్’ పత్తి క్షేత్ర ప్రదర్శన