తెలంగాణ చీఫ్ బ్యూరో ( కొండపర్తి ప్రసన్నకుమార్) :- రాష్ట్రవ్యాప్తంగా గాంధీ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలతో పాటు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు కళాశాలల్లో ఆయన విగ్రహాలతో పాటు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ లంగర్ హౌస్‌లోని బాపూ ఘాట్‌లో తెలంగాణ మంత్రులు ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాపూ ఘాట్‌కు చేరుకుని గాంధీజీకి పుష్పాంజలి ఘటించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సర్వమత ప్రార్థనల్లో గవర్నర్, సీఎం పాల్గొని ప్రార్థనలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమా ర్క, టీపీసీసీ అధ్యక్షు డు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, అజహరుద్దీన్, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహా దారు వి.హనుమంత రావు, తో పాటుప్రభుత్వ విప్‌లు అద్దంకి దయాకర్, రామచంద్రనాయక్, పలువురు ఎమ్మెల్యే లు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, డీజీపీ సీవీ ఆనంద్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు కూడా హాజరై నివాళులర్పించారు.

enivasnews.com





