జయశంకర్ భూపాలపల్లి ప్రతినిధి: కాటారం సర్కిల్ పోలీసులు జడల అశోక్ మృతి కేసులో మిస్టరీని ఛేదించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసులో మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. కాటారం సర్కిల్ ఇన్ స్పెక్టర్ ఇ.నాగార్జున రావు నేతృత్వంలో ఎస్ ఐలు జి.రమేష్, పి.మహేందర్ కుమార్, సిహెచ్.శ్రీనివాస్, జె మహేష్, సిబ్బంది నమ్మదగిన సమాచారం మేరకు యామన్ పల్లి శివారులోని చెరువు సమీపంలో అనుమా నాస్పదంగా సంచరిస్తున్న నిందితులు రత్నం వంశీకృష్ణ, రత్నం రాజు. రాజేందర్, తలారి రాజేందర్లను గుర్తించారు. పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించగా వారిలో రత్నం వంశీకృష్ణ .రత్నం రాజు@రాజేందర్ అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కథనం ప్రకారం సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో అటవీ జంతువులను వేటాడేందుకు అక్రమంగా విద్యుత్ తీగల ఉచ్చులు ఏర్పాటు చేసేవారు. యామన్ పల్లి నిమ్మగూడెం ప్రధాన రహదారి సమీపంలోని 11 కేవీ విద్యుత్ లైన్ నుంచి ఇనుప బైండిం గ్ వైర్ల కు విద్యుత్ సరఫరా కలిపి అటవీ ప్రాంతంలో ఉచ్చులు అమర్చే వారని, ఈ క్రమంలో శుక్రవారం రాత్రి యామన్ పల్లి శివారులోని అటవీ ప్రాంతంలో విద్యుత్ ఉచ్చులు ఏర్పాటు చేశారు. పోడు భూమి చేయడానికి అటు వైపు వచ్చిన అశోక్ అదే రోజు రాత్రి కరెంట్ తీగల ఉచ్చులకు తాకి అక్కడికక్కడే మరణించాడు. మరుసటి రోజు తెల్లవారు జామున ఉచ్చులను పరిశీలించేందుకు వెళ్లిన నిందితులు అక్కడే విద్యుదాఘాతానికి గురై వున్న అజమ్ నగర్ కి చెందిన జడల అశోక్ (32)మృతి చెంది ఉండటాన్ని గుర్తించారు. మృతుడు తమ ఉచ్చుల కారణంగా మరణించిన విషయం బయట పడితే పట్టుబడతామనే భయంతో మృతదేహాన్ని ఒక కర్రకు కట్టుకొని మోసుకెళ్లీ సుమారు కిలోమీటరు దూరంలోని వాగు ఒడ్డున ఉన్న పొదల్లో పడేసినట్లు విచారణలో వెల్లడైంది. అనంతరం పోలీసులకు చిక్కకుండా అడవిలో దాక్కొని మహారాష్ట్రకు పారిపోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో పోలీసులకు పట్టుబడ్డారు. నిందితుల వద్ద నుంచి నేరానికి ఉపయోగించిన ఇనుప బైండింగ్ వైర్, కాటన్ వైర్, ఒక స్మార్ట్ ఫోన్, ఒక కీప్యాడ్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన నిందితులను కోర్టులో హాజరు పరిచి రిమాండ్కు తరలించారు. అటవీ జంతువులను వేటాడేందుకు విద్యుత్ తీగల ఉచ్చులు ఏర్పాటు చేయడం అత్యంత ప్రమాదకరమైన, చట్టవి రుద్ధమైన చర్య అని ఇటువంటి ఉచ్చుల వల్ల మనుషుల ప్రాణాలకు కూడా ముప్పు ఏర్పడుతుందని ఎక్కడైనా అక్రమ విద్యుత్ ఉచ్చులు కనిపించినా, అనుమానాస్పద కార్యకలాపాలు గుర్తించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఎవరైయన ఇటు వంటి చర్యలకు పాల్పడితే కటిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

enivasnews.com





