తెలంగాణ చీఫ్ బ్యూరో ( కొండపర్తి ప్రసన్నకుమార్) :- కరీంనగర్ ప్రతిమ మెడికల్ కళాశాలను ప్రారంభించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భం గా ఈనెల 4న నిర్వహించే సిల్వర్ జూబ్లీ వేడుకలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రానున్నారు. ఈ సందర్భంగా ప్రతిమ డీమ్డ్ యూనివర్శిటీ భవన నిర్మాణ పనులకు అమిత్ షా చేతుల మీదుగా శంకుస్థాపన చేస్తారు. ఈ నేపథ్యంలో అమిత్ షా పర్యటన, కళా శాలలో ఏర్పాట్లను పరిశీలించేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, శుక్రవారం ఉదయం11:30 గంటలకు కరీంనగర్ ప్రతిమ మెడికల్ కళాశాలకు చేరుకుని సంబంధిత అధికా రులతో సమావేశం నిర్వహించారు. అనంతరం నగర పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, బీజేపీ జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం, ప్రతిమ కళాశాల యాజమా న్యం బోయినిపల్లి శ్రీనివాసరావు, చెన్నమనేని వికాస్ రావు, కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్ రావులతో కలిసి హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు. ప్రతిమ కళాశాల అంతా కలియ దిరిగారు. పైలాన్ ఆవిష్కరణ, డీమ్డ్ వర్శిటీ పైలాన్ స్టోన్, ఫోటో ఎగ్జిబిషన్ పరిసరాలతోపాటు విద్యార్థులను ఉద్దేశిం చి ప్రసంగించేందుకు ఏర్పాటు చేసిన సభా ప్రాంగణాన్ని కూడా బండి సంజయ్ పరిశీలించారు.
4న కరీంనగర్ కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా
లోకల్ యాడ్స్
వార్తా విభాగం: తెలంగాణప్రచురణ తేదీ: 02 October 2026 10:21 PM
enivasnews.com




