అగ్ని ప్రమాద బాధితులకు నిత్యవసర సరుకుల పంపిణీ..
 తెలంగాణ చీఫ్ బ్యూరో (కొండపర్తి ప్రసన్నకుమార్ )15:-
 జగిత్యాల జిల్లా
ఎండపల్లి మండల కేంద్రంలోని ఉపసర్పంచ్ దాసరి కొమురయ్య కళ్యాణి ల ఇల్లు ప్రమాదవశాత్తు ఇటీవల కాలిపోగా సమాచారం తెలిసిన వెంటనే లయన్స్ క్లబ్ ఆఫ్ రాజారాంపల్లి తరఫున గురువారం నిత్యావసర సరుకులు మరియు వంట సామాగ్రి దుప్పట్లు అందజేసి మానవత్వాన్ని చాటుకున్నాంరు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సునీత జలంధర్ రెడ్డి, లయన్స్ క్లబ్ ఆఫ్ రాజరాంపల్లి అధ్యక్షులు లయన్ వన్నెల అంజనారెడ్డి, కార్యదర్శి లయన్ గడ్డం నంది రెడ్డి, కోశాధికారి లయన్ బి మురళి, ఫాస్ట్ ప్రెసిడెంట్ లయన్ ఏలేటి  చంద్రారెడ్డి, వీపీ లయన్ టీవీ రమణారెడ్డి, చార్టెడ్ ప్రెసిడెంట్ లయన్ కుంట మల్లారెడ్డి, లయన్ ఏలేటి  భాస్కర్ రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.