తెలంగాణ చీఫ్ బ్యూరో (కొండపర్తి ప్రసన్నకుమార్) :- తెలంగాణలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ గడువును మరోసారి పొడిగించే ఉద్దేశం లేదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికే ఒకసారి గడువు పొడిగించినందున, ప్రస్తుతం నిర్ణయిం చిన షెడ్యూల్ ప్రకారమే ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సర్ ప్రక్రియను పూర్తి చేయాలన్నదే ఎన్నికల సంఘం ఉద్దేశమని చెప్పారు. సర్ ప్రక్రియలో భాగం గా రాష్ట్రవ్యాప్తంగా 92 లక్షల మంది ఓటర్లకు నోటీసులు జారీ చేయగా, ఇప్పటివరకు 65 లక్షల మంది నోటీసు లకు సమాధానం ఇచ్చినట్లు సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. వీరిలో 54 లక్షల మందిని ఫైనల్ ఓటరు లిస్టులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. నవంబర్ 5లోగా మిగిలిన ఓటర్లకు సంబంధిం చిన ప్రాసెస్ కంప్లీట్ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు.ఇకపై హియరింగ్ ప్రాసెస్ ఉండదని, దాని స్థానంలో అవస రమైన డాక్యుమెంట్ల ను సేకరించే ప్రాసెస్ కొనసాగుతుందని సీఈవో తెలిపారు. నోటీసులు అందుకున్న వారి ఇళ్లకే బూత్ లెవల్ అధికారులు వెళ్లి సంబంధిత డాక్యు మెంట్లు సేకరించాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు.
సర్ ప్రక్రియ గడువు మళ్లీ పొడిగించే ఉద్దేశం లేదు...! ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి
లోకల్ యాడ్స్
వార్తా విభాగం: తెలంగాణప్రచురణ తేదీ: 02 October 2026 10:31 PM
enivasnews.com




