తెలంగాణ చీఫ్ బ్యూరో (కొండపర్తి ప్రసన్నకుమార్) :- తెలంగాణ రాష్ట్రం లోని ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు రేవంత్ రెడ్డి సర్కార్ శుభవార్త చెప్పింది. దసరా కానుకగా రెండు కరువు భత్యాల డీఏను ప్రకటించింది. 2024 నుంచి పెండింగ్‌లో ఉన్న డీఏల్లో రెండింటిని విడుదల చేయడానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రెండింటి బకాయి లను వాయిదాల్లో చెల్లిస్తారు. ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన గురువా రం సాయంత్రం సచివాలయంలో మంత్రివర్గ సమావేశం సుదీర్ఘంగా సాగింది. సమావేశం అనంత రం మంత్రులు పొంగు లేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ వివరాలను విలేకరులకు వెల్లడించారు. ఆర్థికంగా భారమైన ప్పటికీ ఉద్యోగ సంఘాలతో చర్చల సందర్భంగా ఇచ్చిన హామీకి కట్టుబడి సీఎం ఉద్యోగులకు డీఏ, పెన్షనర్లకు డీఆర్‌ మంజూరు చేయడానికి అంగీక రించారని తెలిపారు. దీంతో ఏటా రాష్ట్ర ప్రభుత్వంపై రూ. 2500 కోట్ల భారం పడుతుందని చెప్పారు. సంక్షేమ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్న ఉద్యోగులు, వారి కుటుంబాలు కూడా సంతోషంగా ఉండాల న్న ఉద్దేశంతో ఈ డీఏ లను ఆమోదించి నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఎన్‌నినో పరిస్థితులపై క్యాబి నెట్‌లో సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఈ వానాకాలంలో 17 శాతం వర్షపాతం లోటు ఉందని నిర్ధారించారు.బుధవారంతో నైరుతి రుతుపవనాల కాలం కూడా ముగిసిన నేపథ్యంలో రాష్ట్రం లో 235 మండలాల్లో తీవ్ర వర్షభావంతో కరువు పరిస్థితులు నెలకొన్నాయని తేల్చారు. పంటలకే కాకుండా తాగునీటికి కూడా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అంచనాకు వచ్చారు. కరువు ప్రాంతాల్లో తక్షణం చేపట్టాల్సిన చర్యలపై క్యాబినెట్‌ సబ్‌ కమిటీ చర్చించా లని మంత్రివర్గం నిర్దేశించింది. సబ్‌ కమిటీ త్వరగా సమావేశమై ఎల్‌నినో నష్ట నివారణపై చర్చించి, నివేదికను కేబినెట్‌కు అందిం చాలని చెప్పారు. ఈ నివేదిక పై చర్చించేందుకు మంత్రివర్గం అత్యవ సరంగా సమావేశం అవుతుంది. దీంతో పాటు అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.