తెలంగాణ చీఫ్ బ్యూరో( కొండపర్తి ప్రసన్నకుమార్) :- గ్రామ పంచాయతీల్లో చెక్కుల చెల్లింపులకు అడ్డంకులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. అభివృద్ధి పనుల నిధుల విడుదల, వివిధ బిల్లుల చెల్లింపుల్లో జాప్యం లేకుండా చర్యలు చేపట్టింది. చెక్కుల చెల్లింపులకు ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రక్రియ వేగవంతంగా సాగేలా చూడాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆదేశించడంతో జిల్లా పంచాయతీ అధికా రులకు స్పష్టమైన ఉత్తర్వులు జారీ అయ్యాయి. గ్రామాల్లో సర్పంచ్, ఉప సర్పంచ్‌‌ల మధ్య ఉన్న విభేదాల కారణంగా బిల్లుల చెల్లింపులు నిలిచిపో యి అభివృద్ధి పనుల కు ఆటంకం కలగకుం డా చూడటమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ మార్గదర్శకాలను విడుదల చేసింది. తగిన కారణం లేకుండా 7 రోజులకు మించి చెక్కులపై సంతకం చేయకుండా ఉప సర్పంచ్‌లు కాలయాపన చేస్తే, సంబంధిత జిల్లా కలెక్టర్ వెంటనే విచారణ చేపట్టాల్సి ఉంటుంది. ఆ విచారణలో ఉప సర్పంచ్ ఉద్దేశపూర్వ కంగానే చెక్కులను నిలిపివేసినట్లు తేలితే వారిపై చట్టప్ర కారం తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.