రామగిరి ఖిల్లాకు రోప్‌వే.. ఎంపీ చొరవతో మంథని చరిత్రకు మహర్దశ...
కేంద్రం నుంచి రూ.1,230 కోట్ల నిధులు.. 2.1 కి.మీ. రోప్‌వేతో రామగిరి ఖిల్లాకు పర్యాటక వైభవం...
తెలంగాణ చీఫ్ బ్యూరో (కొండపర్తి ప్రసన్నకుమార్) అక్టోబర్ 18 :- ఎన్నో
దశాబ్దాలుగా సరైన పర్యాటక సదుపాయాల కోసం ఎదురుచూస్తున్న చారిత్రక రామగిరి ఖిల్లాకు కొత్త రోజులు రానున్నాయి. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ కృషితో రామగిరి ఖిల్లాకు రోప్‌వే ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం ప్రాంత పర్యాటక అభివృద్ధిలో కీలక ముందడుగుగా నిలిచింది. చారిత్రక సంపదను పర్యాటక ఆకర్షణగా మలిచి, మంథని ప్రాంతానికి కొత్త గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో ఎంపీ చేసిన ప్రయత్నాలు ఫలితాన్నిచ్చాయి.
రామగిరి ఖిల్లా ప్రాధాన్యతను గుర్తించిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఈ ప్రాంతాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి వినతిపత్రం సమర్పించి రోప్‌వే ఏర్పాటుకు కృషి చేశారు. ఖిల్లా చారిత్రక ప్రాధాన్యతతో పాటు పర్యాటకులకు మెరుగైన రవాణా సదుపాయాల అవసరాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఆయన చేసిన ప్రయత్నాలకు ఫలితంగా 2.1 కిలోమీటర్ల రోప్‌వే ప్రాజెక్టుకు రూ.2.46 కోట్ల నిధులు విడుదల చేసిన కేంద్రం
2.1 కిలోమీటర్ల రోప్‌వే తోపాటు రామగిరి ఖిల్లాకు కొత్త ఆకర్షణ సంతరించుకోనుంది.
కొండ దిగువ నుంచి ఖిల్లా శిఖరం వరకు రోప్‌వే ఏర్పాటు చేయడం ద్వారా పర్యాటకులు, సందర్శకులు సులభంగా పైకి చేరుకునే అవకాశం కలగనుంది. రామగిరి ఖిల్లాలోని చారిత్రక కట్టడాలు, ప్రకృతి అందాలు, అరుదైన ఔషధ మొక్కలను వీక్షించేందుకు ఈ సదుపాయం ఎంతో ఉపయోగపడనుంది. రోప్‌వేతో పాటు ఇతర పర్యాటక మౌలిక సదుపాయాల అభివృద్ధికి కూడా రూ.2.50 కోట్ల అదనపు నిధులు మంజూరు
స్థానిక యువతకు ఉపాధి తోపాటు వ్యాపారాలకు కొత్త అవకాశాలు కలవనున్నాయి.
రామగిరి ఖిల్లా అభివృద్ధి చెందితే మంథని, పెద్దపల్లి పరిసర ప్రాంతాల్లో పర్యాటకుల రాక పెరిగే అవకాశం ఉంది. దీంతో హోటళ్లు, రవాణా, చిరు వ్యాపారాలు, పర్యాటక సేవలకు డిమాండ్ పెరిగి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రావచ్చు. చారిత్రక వారసత్వాన్ని పరిరక్షిస్తూ ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి బాటలు వేయడంలో ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషించనుంది.పెద్దపల్లి అభివృద్ధే లక్ష్యంగా ఎంపీ వంశీకృష్ణ అడుగులు..
పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని చారిత్రక, పర్యాటక ప్రాంతాలకు ప్రాధాన్యత తీసుకురావడం ద్వారా స్థానిక ప్రాంతాలకు కొత్త గుర్తింపు కల్పించాలనే దిశగా ఎంపీ గడ్డం వంశీకృష్ణ చేస్తున్న కృషిలో రామగిరి ఖిల్లా రోప్‌వే ప్రాజెక్టు ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చి పర్యాటకులకు అందుబాటులోకి వస్తే, రామగిరి ఖిల్లా తెలంగాణలో ప్రముఖ పర్యాటక కేంద్రంగ మారనుంది.
రామగిరి ఖిల్లాకు రోప్‌వే సాధన పెద్దపల్లి జిల్లా పర్యాటక భవిష్యత్తుపై కొత్త ఆశలను రేకెత్తిస్తోంది. ఎంపీ గడ్డం వంశీకృష్ణ చొరవతో ముందుకు సాగుతున్న ఈ ప్రాజెక్టు విజయవంతమైతే చారిత్రక రామగిరికి కొత్త వైభవం, స్థానిక యువతకు కొత్త అవకాశాలు లభించనున్నాయి.
రామగిరి ఖిల్లాకు రోప్‌వే.. ఎంపీ చొరవతో మంథని చరిత్రకు మహర్దశ
కేంద్రం నుంచి రూ.1,230 కోట్ల నిధులు.. 2.1 కి.మీ. రోప్‌వేతో రామగిరి ఖిల్లాకు పర్యాటక వైభవం...
లోకల్ యాడ్స్
వార్తా విభాగం: తెలంగాణప్రచురణ తేదీ: 17 October 2026 06:17 PM
K Prasanna Kumar




