తవక్కల్ విద్యాసంస్థల చైర్మన్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేసి, పాఠశాల గుర్తింపు రద్దు చేయాలి..
 వామపక్ష విద్యార్థి సంఘాల నిరసన..
 తెలంగాణ చీఫ్ బ్యూరో (కొండపర్తి ప్రసన్నకుమార్) అక్టోబర్ 18:- మంచిర్యాల జిల్లా
రామకృష్ణాపూర్ పరిధిలోని తవక్కల్ విద్యాసంస్థల తీరుకు నిరసనగా అంబేద్కర్ విగ్రహం ఎదుట శనివారం  వామపక్ష విద్యార్థి సంఘాలు ఏఐఎస్బి , ఎస్ఎఫ్ఐ, పి డి ఎస్ యు ల ఆధ్వర్యంలో  నిరసన  చేపట్టారు . ఈ సందర్భంగా వామపక్ష సంఘాల నాయకులు మాట్లాడుతూ విద్యార్థులు ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా పదవ తరగతి తరగతులునిర్వహిస్తూ, విద్యార్థులను మానసికంగా వేధిస్తున్న తీరును ప్రశ్నించడానికి వెళ్లిన విద్యార్థి సంఘ నాయకులపై దుర్భాషలాడుతూ భౌతిక దాడికి యత్నించిన పాఠశాల చైర్మన్ వైఖరిని ఈ సందర్భంగా నాయకులు తీవ్రంగా ఖండించారు.ప్రభుత్వ నిబంధనలను బొందపెట్టి అక్రమ తరగతులు నడుపుతున్నారనే విషయాన్ని ప్రశ్నిస్తే, సమాధానం చెప్పలేక చైర్మన్ అహంకారపూరితంగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి వెంకటస్వామి పేరు చెప్పుకొని, పోలీసు వ్యవస్థను మరియు ప్రభుత్వ నిబంధనలను లెక్కచేయకుండా బెదిరింపులకు దిగడం సిగ్గుచేటని అన్నారు. విద్యాసంస్థను వ్యాపార కేంద్రంగా మార్చి, విద్యార్థుల భవిష్యత్తు మరియు మానసిక ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఇలాంటి యాజమాన్యంపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
విద్యార్థి సంఘాల ప్రధాన డిమాండ్లు ఇవే
..విద్యార్థి సంఘాల నాయకులపై దుర్భాషలాడి, భౌతిక దాడికి ప్రయత్నించిన తవక్కల్ విద్యాసంస్థల చైర్మన్‌పై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు.
అనుమతులు లేకుండా అక్రమ తరగతులునిర్వహిస్తూ విద్యార్థులను మానసిక వేధింపులకు గురిచేస్తున్న పాఠశాల గుర్తింపును  విద్యాశాఖ వెంటనే రద్దు చేయాలన్నారు.
రాజకీయ అండదండలు చూపి బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై సమగ్ర విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవా అన్నారు.
అక్రమంగా నడుస్తున్న పాఠశాల గుర్తింపును రద్దు చేసి, చైర్మన్‌పై క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు.అవసరమైతే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలను ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు:
 ఏఐఎస్బి  జిల్లా ప్రధాన కార్యదర్శి సన్నీ గౌడ్,పి డి ఎస్ యు  రాష్ట్ర జాయింట్ సెక్రటరీ శ్రీకాంత్,
దాగం శ్రీకాంత్,
రెడ్డి చరణ్,
అరుణ్ కుమార్
తదితరులు పాల్గొన్నారు.