ఎస్ఐఆర్ ప్రక్రియ నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి...
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి...
తెలంగాణ చీఫ్ బ్యూరో కొండపర్తి ప్రసన్నకుమార్ అక్టోబర్ 18:-
ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ ప్రక్రియ వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి సూచించారు. శనివారం హైదరాబాద్ నుండి ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఈ.ఆర్.ఓ.లు, ఎ.ఈ.ఆర్.ఓ.లు, ఎన్నికల విభాగం అధికారులతో ఎస్ఐఆర్ ప్రక్రియ పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ఎ.ఈ.ఆర్.ఓ.లు తమ పరిధిలోని బూత్ స్థాయి అధికారులు, సూపర్వైజర్లతో సమన్వయం చేసుకుంటూ ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేయాలని తెలిపారు. నిర్ణీత గడువులోగా ప్రక్రియను పూర్తి చేసే విధంగా సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ఎస్ఐఆర్ ప్రక్రియ సజావుగా,పారదర్శకంగా కొనసాగేందుకు సంబంధిత అధికారులు పరస్పర సమన్వయంతో పని చేయాలని తెలిపారు. అక్టోబర్ 1వ తేదీ ప్రామాణికంగా 18 సంవత్సరాలు నిండిన, అర్హత గల ప్రతి ఒక్క ఓటరు వివరాలు జాబితాలో తప్పనిసరిగా ఉండాలని, అనర్హుల వివరాలు ఖచ్చితంగా ఉండకూడదని తెలిపారు.మంచిర్యాల
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను ఎన్నికల సంఘం నిబంధనల మేరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఎ.ఈ.ఆర్.ఓ.లు, సూపర్వైజర్లు, బూత్ స్థాయి అధికారుల సమన్వయంతో ప్రక్రియను వేగవంతం చేయడం జరుగుతుందని, ఓటర్ల నుండి సేకరించిన ధ్రువపత్రాలను నిబంధనల మేరకు పరిశీలించి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రత్యేక శిబిరాలు నిర్వహించి ఫారం 6, 7, 8 దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, పరిష్కార ప్రక్రియ చేపట్టడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య, జిల్లా రెవెన్యూ అధికారి మోతీరామ్, ప్రత్యేక ఉపపాలన అధికారి చంద్రకళ,తహసిల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, ఎన్నికల విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఎస్ఐఆర్ ప్రక్రియ నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి...
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి...
లోకల్ యాడ్స్
వార్తా విభాగం: తెలంగాణప్రచురణ తేదీ: 17 October 2026 06:42 PM
K Prasanna Kumar




