తెలంగాణ చీఫ్ బ్యూరో( కొండపర్తి ప్రసన్నకుమార్) :- గ్రేటర్ హైదరాబాద్ మహానగరం పరిధి లోని ప్రయాణికులకు టీజీ.ఆర్.టి.సి, హైదరాబాద్ మెట్రో రైల్ సంయుక్తంగా ప్రయాణికులకు శుభవార్త అందించింది. రోజూ లక్షలాది ప్రజలు ఉద్యోగ, ఉపాధి నిమిత్తం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి బస్సులు, మెట్రో రైళ్లలో ప్రయాణాలు సాగిస్తుంటారు. ఆర్టీసీ బస్సుల్లో రోజూ సుమారు 25 లక్షల మంది, మెట్రో రైల్ మూడు కారిడార్లలో రోజుకు సుమారు నాలుగు న్నర లక్షల మంది ప్రయాణాలు చేస్తున్నారు. వారంతా బస్సులు, మెట్రో రైలుకు రెండు వేర్వేరు టిక్కెట్లు లేదా పాస్‌లతో ప్రయాణాలు చేస్తున్నారు. దీంతో ప్రయాణికు లపై ఆర్థిక భారం పడటం సహా సమయం వృథా అవుతోంది. ఈ పరిస్థితిని గుర్తించిన ప్రభుత్వం నగరం లోని బస్సులు, మెట్రో రైళ్లకు వేర్వేరు పాస్‌లు కాకుండా ఒకే పాస్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ 'కామన్ పాస్' విధానం నేటి నుంచి అందుబాటు లోకి రానుంది. ఈ రోజు ప్రజాభవన్ లో జరిగే కార్యక్రమం లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామి, ఆర్టీసీ మంత్రి పొన్నం ప్రభాకర్,కామన్ పాస్ విధానాన్ని శుక్రవారం లాంఛనంగా ప్రారం భించనున్నారు.
మెట్రో రైల్ - సిటీ బస్సులకు ఒకటే పాస్ అమర్
లోకల్ యాడ్స్
వార్తా విభాగం: తెలంగాణప్రచురణ తేదీ: 02 October 2026 10:47 PM
enivasnews.com




