తెలంగాణ చీఫ్ బ్యూరో( కొండపర్తి ప్రసన్నకుమార్) :-మహత్మాగాంధీ జయంతి పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట సబ్ జైల్ లో ఖైదీల సంక్షేమ దినోత్సవాన్ని జైలు పర్యవేక్షణాధికారి స్వామి శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లక్షెట్టిపేట సిఐ రమణమూర్తి పాల్గొని ఖైదీలను ఉద్దేశించి మాట్లాడుతూ  క్షణికావేశాన్ని తగ్గించుకుంటే నేరాలు జరిగే అవకాశం ఉండదని, క్షణికావేశంలో విచక్షణ కోల్పోయి నేరాలకు పాల్పడి జైలుకు రావాల్సిన అవసరం ఉండదన్నారు. నేర ప్రవృతిని విడనాడి సమాజానికి ఉపయోగపడే పౌరులుగా తయారవ్వాలన్నారు. అనంతరం ఖైదీలకు బహుమతులు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జైలు పర్యవేక్షణాధికారి స్వామి తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.