తాళ్ల పేటలో ఎలాంటి సంఘటన జరగకుండా పోలీసుల పికెటింగ్..
తెలంగాణ చీఫ్ బ్యూరో( కొండపర్తి ప్రసన్నకుమార్) అక్టోబర్ 20:- మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేటలో ఆదివారం రాత్రి బతుకమ్మ సంబరాలు నేపథ్యంలో జరిగిన సంఘటన తీవ్ర రూపం దాల్చడంతో ముందస్తు భద్రత నిమిత్తం మంచిర్యాల డిసిపి ఆదేశాల మేరకు దాదాపు ఏడుగురు ఎస్ఐల ఆధ్వర్యంలో 100 మంది పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. లక్షెట్టిపేట సిఐ బతుకమ్మ ఆడుతున్న గిరిజన మహిళా సర్పంచ్ కళావతి తో పాటు ఉప సర్పంచ్ పై విచక్షణ రహితంగా చితక బాధడంతోఈ ఉదృత పరిస్థితి నెలకొన్న విషయం ప్రజలకు తెలిసిందే . గత కొంతకాలంగా మంచిర్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో రెండు వర్గాలుగా విడిపోయిన నేపథ్యంలో మంతెన జగన్మోహన్ కు భారీగా మద్దతు పెరుగుతుండడంతో అది సహించలేని అధిష్టాన వర్గం పోలీసులను ఉసిగొలిపిందని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు రెచ్చిపోవడంతో ఈ పరిస్థితి అక్కడ నెలకొంది. విషయం తెలిసిన వెంటనే మరో కాంగ్రెస్ నేత జగన్మోహన్ అక్కడి ప్రజలకు అండగా నిలవడంతో పరిస్థితి మరింత విషమంగా మారిన నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులు జరుగుతాయన్న ఉద్దేశంతో ముందస్తుగా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేసినట్లు సమాచారం.
తాళ్ల పేటలో ఎలాంటి సంఘటన జరగకుండా పోలీసుల పికెటింగ్..
తాళ్ల పేటలో ఎలాంటి సంఘటన జరగకుండా పోలీసుల పికెటింగ్..
లోకల్ యాడ్స్
వార్తా విభాగం: తెలంగాణప్రచురణ తేదీ: 19 October 2026 08:07 PM
K Prasanna Kumar




