దుర్గామాత నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ డిసిసి అధ్యక్షురాలు... 
 తెలంగాణ చీఫ్ బ్యూరో (కొండపర్తి ప్రసన్నకుమార్) అక్టోబర్ 20 :-
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మార్వతి యువ మంచ్ మార్వాడిఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన దాండియా కార్యక్రమంలో మాజీ డిసిసి అధ్యక్షురాలు సురేఖ ప్రేమ్ సాగర్ రావు పాల్గొన్నారు. మార్వాడి సోదరీమణులతో కలిసి దాండియా ఆడారు.అమ్మవారి ఆశీస్సులతో అందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో కలగాలని కోరుకుంటూ, ప్రజలందరికీ విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ , డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్ , కార్పొరేటర్లు మాదంశెట్టి సత్యనారాయణ, చిలువేరి జ్యోతి శ్రీనివాస్, పెంట రజిత -రమేష్, మార్వాడి సభ్యులు జుగల్ కిషోర్ వాయస్, గోపాల్ వాయస్, భరత్ లడ్డా  తదితరులు పాల్గొన్నారు.