కలెక్టర్, అధికారుల నిర్లక్ష్యంతోనే పెద్దపల్లి ఎయిర్‌పోర్టు వెనుకబాటు..
ఎంపీ గడ్డం వంశీకృష్ణ..
 తెలంగాణ చీఫ్ బ్యూరో  (కొండపర్తి ప్రసన్నకుమార్) అక్టోబర్ 20 :-
పెద్దపల్లి జిల్లారామగుండం ఎయిర్‌పోర్టు కోసం గత రెండేళ్లుగా పార్లమెంటులో పలుమార్లు ప్రశ్నించడం తో పాటు, వ్యక్తిగతంగా సైట్ విజిట్లు చేసి ప్రయత్నించినప్పటికీ, కలెక్టర్ ,అధికారుల నిర్లక్ష్యంతో ప్రాజెక్టు చేజారిపోయిందని ఎంపీ గడ్డం వంశీకృష్ణ విమర్శించారు.
కలెక్టరు మన జిల్లా ప్రజలకు పనిచేస్తున్నారా? లేక ప్రత్యేక మంత్రికి ఒక పి ఏ లెక్క పనిచేస్తున్నారా?” అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి రూ.50 లక్షలు చెల్లించినప్పటికీ ఎయిర్‌పోర్టు విషయంలో ముందడుగు పడకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు.రామగుండం ఎయిర్‌పోర్టు కోసం పోరాటం ఆపేది లేదు అని స్పష్టం చేశారు. ఈ స్ ఐ ఆసుపత్రి విషయంలోనూ కలెక్టర్, అధికారులు నిర్లక్ష్యం చేస్తే కార్మికుల ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఎయిర్‌పోర్టుతోటి ఎట్లయితే చేసిండ్రో, రామగుండం ఈ స్ ఐ ఆసుపత్రి విషయంలో కూడా అట్ల చేస్తే కార్మికుల శాపం మీకు తగులుతది”* అని ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేయాలని సూచించారు.