గ్రామ అవసరాలకు అనుగుణంగా పనుల నిర్వహణ చేపట్టేలా చర్యలు తీసుకుంటాం..
అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య...
తెలంగాణ చీఫ్ బ్యూరో (కొండపర్తి ప్రసన్నకుమార్) అక్టోబర్ 2:-
గ్రామ అవసరాలకు అనుగుణంగా పనులు గుర్తించి చేపట్టేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి. చంద్రయ్య సూచించారు .శుక్రవారం మంచిర్యాల జిల్లాలోని జైపూర్ మండలం టేకుమట్ల గ్రామంలో స్వచ్ఛత హి సేవ లో భాగంగా ఏర్పాటుచేసిన గ్రామ సభకు మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీపతి బాపు, అధికారులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఈ గ్రామసభలలో గ్రామాభివృద్ధి, ఉపాధి హామీ పనుల ప్రణాళిక, గ్రామానికి అవసరమైన మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై చర్చించి కార్యాచరణ రూపొందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. వీబీ-జీ రామ్ జీ పథకానికి సంబంధించిన నూతన మార్గదర్శకాలు, ఉపాధి హామీ పనుల ప్రణాళిక, గ్రామ అవసరాలకు అనుగుణంగా పనుల ఎంపిక జరుగుతుందని తెలిపారు. గ్రామ పంచాయతీల పరిధిలోని ప్రతి జాబ్‌కార్డు కలిగిన కుటుంబానికి ఉపాధి కల్పించడంతో పాటు గ్రామాల అభివృద్ధికి ఉపయోగపడే పనులనుప్రాధాన్యతతో చేపట్టాలని అధికారులకు సూచించారు. గతంలో ఉపాధి హామీ పథకంగా అమలైన కార్యక్రమం ప్రస్తుతం వీబీ-జీ రామ్‌జీ పథకం కింద అమలవుతోందని తెలిపారు. గ్రామసభలో స్థానిక అవసరాలకు అనుగుణంగా పనులను గుర్తించి పనుల నిర్వహణకు అవసరమైన తీర్మానం చేయాలని తెలిపారు. వర్షాభావ పరిస్థితులు, నీటి కొరతను దృష్టిలో ఉంచుకొని వాటర్ హార్వెస్టింగ్, చెక్‌డ్యామ్‌లు, ఫీడర్ ఛానళ్ల శుభ్రత, ఇంకుడు గుంతలు, బోర్వెల్ రీచార్జ్ నిర్మాణాలు, రూఫ్‌టాప్ వాటర్ హార్వెస్టింగ్ వంటి పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. ప్రతి ప్రభుత్వ భవనం వద్ద వర్షపు నీటిని సంరక్షించే నిర్మాణాలు ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రామాలలోని ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసి, ఇంటి నుంచి వెలువడే వాడుక నీటిని భూమిలోకి ఇంకేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. గ్రామాల పారిశుద్ధ్యంతో పాటు భూగర్భ జలాల పెంపునకు దోహదపడుతుందని వివరించారు. జాబ్‌కార్డు కలిగిన కూలీలకు నిరంతరం ఉపాధి కల్పించడం ద్వారా గ్రామీణ కుటుంబాలకు ఆదాయం లభించడంతో పాటు గ్రామ పంచాయతీలకు మెటీరియల్ కాంపోనెంట్ నిధులు సమకూరుతాయని, నిధులను గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధికి వినియోగించుకోవాలని సూచించారు. గ్రామీణ ఉపాధి, నీటి సంరక్షణ, పారిశుద్ధ్యం, జీవనోపాధి మౌలిక వసతుల అభివృద్ధికి గ్రామసభల ద్వారా సమగ్ర కార్యాచరణ రూపొందించాలని అధికారులకుసూచించారు. గ్రామంలోని అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించి పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలపై ప్రత్యేక దృష్టి సారించాలని, పిల్లల ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షించాలని తెలిపారు.అనంతరం వేలాల గ్రామ సమీపంలోని గోదావరి నది తీరంలో పుష్కర ఘాట్ ఏర్పాటు పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. గోదావరి పుష్కరాలు 2027 ఏర్పాట్లకు సంబంధించి క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించారు. సుమారు 14.30 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న గోదావరి పుష్కర ఘాట్, సుమారు 3 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టే అభివృద్ధి పనులు, సి సి రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదించిన ప్రాంతాలనుపరిశీలించారు. పుష్కరాల సందర్భంగా భక్తులకు అవసరమైన మౌలిక వసతులు,రహదారులు, పారిశుద్ధ్యం, త్రాగునీరు తదితర సౌకర్యాల కల్పనకు సంబంధించిఅధికారులకు అవసరమైన సూచనలు చేశారు. వి బి జి రామ్ జి పథకంలో గుర్తించిన 375 రకాల పనులలో గ్రామానికిఅవసరమైన పనులను గ్రామసభ ద్వారా గుర్తించి ప్రాధాన్యత క్రమంలో చేపట్టాలని సూచించారు. గ్రామ అవసరాలకు అనుగుణంగా పనుల ప్రణాళిక రూపొందించాలని, ఉపాధి కల్పనతో పాటు గ్రామంలో శాశ్వత సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. ప్రస్తుత వర్షాకాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని జల సంరక్షణ, నీటి నిల్వలు, నీటి వనరుల అభివృద్ధికిసంబంధించిన పనులను గుర్తించి చేపట్టాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్లు, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా సంబంధిత అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. గ్రామంలోని గట్టు మల్లన్న స్వామి ఆలయాన్ని సందర్శించి స్వామిని దర్శించుకున్నారు. పుష్కరాల ఏర్పాట్లలో భాగంగా ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఇందుకు గాను అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో టేకుమట్ల, వేలాల సర్పంచ్ లు బల్ల వెంకటేష్, డేగ స్వప్న, గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్ అధికారులు, ప్రజా ప్రతినిధులు,సంబంధిత అధికారులు తదితరులు.
enivasnews.com





