ప్రజలకు ఇబ్బందులు కలగకుండా రాకపోకలకు ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయాలి... ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు.. 
 తెలంగాణ చీఫ్ బ్యూరో( కొండపర్తి ప్రసన్నకుమార్) అక్టోబర్ 23 :-
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రాళ్లవాగు బ్రిడ్జి నిర్మాణ పనులను సంబంధిత అధికారులతో కలిసి మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గురువారం పరిశీలించారు.
బ్రిడ్జిపనులుజరుగుతున్న సమయంలో ప్రజలకు,వాహనదారులకు రాకపోకల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాత్కాలికంగా మట్టి రోడ్డును ఏర్పాటు చేయాలని ఆర్ అండ్ బి అధికారులకు, మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
ప్రజల సౌకర్యానికి ప్రాధాన్యతనిస్తూ, నిర్మాణ పనుల సమయంలో రాకపోకలకు ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ప్రజా సౌకర్యమే ప్రథమ ప్రాధాన్యత ఇస్తామన్నారు. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం అన్నారు.ఈ కార్యక్రమంలో సంబంధితఅధికారులు, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్ తూముల నరేష్, మంచిర్యాల జిల్లా ఆర్ జి పి ఆర్ స్ అధ్యక్షులు గడ్డం త్రిమూర్తి, కార్పొరేటర్లు, నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..