తెలంగాణ చీఫ్ బ్యూరో ( కొండపర్తి ప్రసన్నకుమార్) :-ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ లో గల జవహర్ నవోదయ విద్యాలయంలో 2027–28 విద్యా సంవత్సరానికి 9వ తరగతి, 11వ తరగతులలో ప్రవేశాల కోసంనిర్వహించనున్న లేటరల్ ఎంట్రీ సెలెక్షన్ టెస్ట్-2027కు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ గడువును ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించడం జరిగిందని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య శుక్రవారంఒక ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థులు ఎటువంటి రుసుము లేకుండా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని, 9వ తరగతి ప్రవేశాలకు https://cbseitms.nic.in/2026/nvsix_9, 11వ తరగతి ప్రవేశాలకు https://cbseitms.nic.in/2026/nvsxi_11 వెబ్ సైట్ల ద్వారా ఈ నెల 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని, ఏప్రిల్ 10వ తేదీ ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రవేశ పరీక్ష ఉంటుందని, అర్హత గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.