తెలంగాణ చీఫ్ బ్యూరో (కొండపర్తి ప్రసన్నకుమార్) :- పోలీసు అధికారులు, సిబ్బందిలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకోవాలని రామగుండం కమిషనర్ అంబర్ కిషోర్ జ తెలిపారు. శారీరక, మానసిక దృఢత్వాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో నిర్వహించిన 5వ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026 క్లస్టర్–C పోటీలు హైదరాబాద్‌లోని ఆర్బీవీఆర్ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీలో సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు మూడు రోజులపాటు నిర్వహించారు. కాళేశ్వరం జోన్–I తరఫున పాల్గొన్న రామగుండం పోలీస్ కమిషనరేట్ క్రీడాకారులు టేబుల్ టెన్నిస్,బ్యాడ్మింటన్ విభాగాల్లో 1 రజతం, 6 కాంస్య పతకాలు సాధించి మొత్తం 7 పతకాలు కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝాక్రీడాకారులను శాలువాలతో సత్కరించి,అభినందనలు తెలిపారు.ఈ పోటీల్లో రామగుండం కమిషనరేట్ తరఫున మొత్తం 17 మంది క్రీడాకారులుపాల్గొన్నారు.టేబుల్ టెన్నిస్ విభాగంలో 5 కాంస్య పతకాలు సాధించారు. 50+ మిక్స్డ్ డబుల్స్‌లో ఏసీపీ ప్రతాప్,డబ్ల్యూపీసీ ఎం.వనిత జోడీ కాంస్య పతకం సాధించింది. 40+ సింగిల్స్‌లో పీసీ ఎం.ఉదయ్ కిరణ్, పిసి -3499 కాంస్య పతకం సాధించారు. ఓపెన్ ఉమెన్స్ డబుల్స్‌లో డబ్ల్యూపీసీ కె. విజయ,కె.దీప జోడీ కాంస్య పతకం సాధించింది. 40+ ఉమెన్స్ డబుల్స్‌లో డబ్ల్యూపీసీ ఎం. వనిత,కె.విజయ, పిసి -1469 కాంస్య పతకం సాధించారు. 40+ మిక్స్డ్ డబుల్స్‌లో పీసీ డి. రాజేందర్, పిసి -2952 మరియు డబ్ల్యూపీసీ ఎం. వనిత జోడీ కాంస్యపతకంసాధించింది.బ్యాడ్మింటన్ విభాగంలో ఓపెన్ సింగిల్స్‌లో కె. సురేష్ రజత పతకం సాధించారు.ఓపెన్ మిక్స్డ్ డబుల్స్‌లో కె. సురేష్,కె.విజయ జోడీ కాంస్య పతకం సాధించింది. ఈ సందర్భంగా సీపీ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ,విధి నిర్వహణతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరిచికమిషనరేట్కు మంచిపేరు తీసుకురావడం అభినందనీయమని అన్నారు.పోలీసు విధుల్లో నిరంతరం ఒత్తిడితో పనిచేసే అధికారులు, సిబ్బందికి క్రీడలు శారీరక,మానసిక దృఢత్వాన్ని పెంపొందించడంలో కీలకపాత్రపోషిస్తాయని తెలిపారు.క్రీడల్లో ప్రతిభ చూపుతున్న పోలీసు అధికారులు, సిబ్బందిని శాఖ తరఫున ప్రోత్సహిస్తూ అవసరమైన సహకారం అందిస్తామని సీపీ తెలిపారు. భవిష్యత్తులోనూ మరిన్ని విజయాలు సాధించి పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్) కె.శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేంద్ర గౌడ్,ఏఆర్ ఏసీపీ ప్రతాప్, ఆర్ఐలు మల్లేశం, శేఖర్,రమేష్,సీసీ సందీప్, ఆర్ఎస్ఐలు, రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు నవీన్, సభ్యులు వినోద్ తదితరులు పాల్గొన్నారు.
పోలీసు అధికారులు క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకోవాలి..! రామగుండం సిపి అంబర్ కిషోర్ జూ
లోకల్ యాడ్స్
వార్తా విభాగం: తెలంగాణప్రచురణ తేదీ: 02 October 2026 11:30 PM
enivasnews.com




