మద్యం  తాగించి  మోసం చేశారు..
బ్రతికినన్ని రోజులు ఎమ్మెల్యే వెంటే ఉంటా...
 తెలంగాణ చీఫ్ బ్యూరో( కొండపర్తి ప్రసన్నకుమార్) అక్టోబర్ 23:- మద్యం  తాగించి, నన్ను బెదిరించి జగన్ మోహన్ రావు వర్గంలో చేర్చుకున్నారని జిల్లా ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్ విలేకరుల సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం రాత్రి కాంగ్రెస్ నాయకులు స్థానిక ఐబీ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూతనకు బలవంతంగా 4 బీర్లు తాగించి, కిడ్నాప్ చేశారన్నారు. హైదరాబాద్ కు తీసుకుని వెళ్ళుతుండగా మార్గమథ్యంలో తాను ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు కాల్ చేయగా, తనను ఎమ్మెల్యే రక్షించినట్లు వివరించారు. తాను బ్రతికి ఉన్నంత వరకు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుతోనే ఉంటానని వెల్లడించారు.అనంతరం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ మాట్లాడుతూ ప్రేమ్ సాగర్ రావును మానసికంగా దెబ్బ తీయాలనే ధోరణితో నియోజకవర్గంలో కొందరు కుట్రలు చేస్తున్నారన్నారు. జిల్లా ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కిడ్నాప్ చేశారన్నారు. ప్రతి ఒక్కరికి పదవులు రావడానికి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చేసిన కృషి మరచిపోయారని మండిపడ్డారు. మా నాయకులు, కార్యకర్తల జోలికి వస్తే బాగుండదని హెచ్చరించారు. మీకు దమ్ము, ధైర్యం ఉంటే రండి చూసుకుందాం అని సవాల్ విసిరారు. అంతేకాకుండా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు ఈ చీలికల వ్యవహారాన్ని పట్టించుకోవడం లేదని వాపోయారు. బీజేపీ,బీఆర్ఎస్ ల సహకారంతోనే కాంగ్రెస్ పార్టీనిచీల్చుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం నాయకులు స్థానిక పోలీస్ స్టేషన్ లో శ్రీనివాస్ ను కిడ్నాప్ చేసిన పలువురి పైన ఫిర్యాదు చేశారు. ఈ సమావేశంలో జెండా వెంకటాపూర్ సహకార సంఘం చైర్ పర్సన్ చల్లా నాగభూషణం, మంచిర్యాల, లక్షేట్టిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీల చైర్మన్లు రామగిరి బానేష్, అక్కల వెంకటేశ్వర్లు, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు పూదరి తిరుపతి, నాయకులు త్రిమూర్తి, షాహిద్ అలీ, ఆరీఫ్, పింగళి రమేష్, నర్సయ్య, వెంకటస్వామి గౌడ్, పూర్ణ చందర్ రావు, నలిమేల రాజు,బానేష్, వెంకటేష్,సందెల సురేష్, గోప  రమేష్, సురేష్ నాయక్, ముక్రం జా తదితరులు పాల్గొన్నారు.