ప్రజా వ్యతిరేకసర్ ప్రక్రియను బేషరతుగా రద్దు చేయాలి..
అదనపు కలెక్టర్ కు వినతి పత్రం అందజేత..
 తెలంగాణ చీఫ్ బ్యూరో( కొండపర్తి ప్రసన్నకుమార్) అక్టోబర్ 24:- ప్రజా వ్యతిరేక ప్రక్రియను బేశారతిగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారంఏ ఐ కే ఎం స్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా అదన కలెక్టర్ చంద్రయ్యకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 
కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ను తన పదవి నుండి తొలగించాలని, అక్రమంగా తొలగించిన అర్హుల ఓట్లను తిరిగి ఓటరు జాబితాలో చేర్చాలని, కేంద్రంలో బిజెపి మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న తప్పుడు, ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించిన వాళ్లను, ముస్లిం, క్రిస్టియన్, మైనారిటీకి చెందిన అర్హులైన వాళ్ళ ఓట్లను అక్రమంగా తొలగించే కుట్రలకు పాల్పడుతుందని, ఇందులో భాగంగానే ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ద్వారా అర్హులైన ఓటర్లను ఓటరు జాబితా నుండి తొలగించడానికి పూనుకున్నదని, రాజ్యాంగానికి లోబడి, స్వాతంత్రంగా ఉండాల్సిన ప్రస్తుత ఎన్నికల కమిషనర్ బిజెపి కి కార్యకర్తగా, నాయకునిగా వ్యవహరిస్తున్న తీరు చాలా సరైనది కాదని, ఒకప్పుడు గ్రామీణ, పట్టణ పరిసర ప్రాంతాలలో ప్రజలను ఓటు విషయంలో ఎడ్యుకేట్ చేస్తూ ఓటర్ నమోదు చేయించిన పరిస్థితి నుండి బిజెపి అధికారంలోకి వచ్చాక అర్హులైన ఓట్లను, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారనే దుర్మార్గమైన చర్యకు పూనుకుంటుందని, ఇప్పటికే 20 కోట్లకు పైగానే అర్హులైన వాళ్ల ఓట్లను ఓటరు జాబితా నుండి తొలగించారని దీనంతటికీ కారణం ఒక ఉన్నతమైన రాజ్యాంగ పదవిలో ఉన్న ఎన్నికల కమిషనర్ ఈ విధంగా ప్రభుత్వంకు ఏజెంటుగా, కీలుబొమ్మగా మారి ఏది చెబితే, ఎవరి ఓట్లు తీసేయమంటే కోట్లల్లో అర్హులైన ఓటర్లను తొలగించడం ఎంత అన్యాయమని, అందుకే ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ప్రజా ద్రోహి ఇతన్ని తక్షణమే పదవి నుండి తొలగించాలని, సర్ ప్రక్రియను వెంటనే రద్దు చేయాలని, తొలగించిన ఓటర్లను ఎలాంటి షరతులు విధించకుండా ఓటర్ జాబితాలో చేర్చాలని, సంయుక్త కిషన్ మోర్చా  ( ఎస్ కే యం ) రైతు సంఘాలు, కేంద్ర బిజెపి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు.
ఈకార్యక్రమంలోబోడెంకి చందు,
 ఏఐకేఎస్ జిల్లా కార్యదర్శి,గోగర్ల శంకర్,ఏ ఐ కే కే ఎస్ జిల్లా కార్యదర్శి,
 ప్రకాష్ సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు,
 ఇందారపు రాజేష్,
 ఏ ఐ కె ఎస్ జిల్లా సహాయ కార్యదర్శి,
 దొండ ప్రభాకర్,
 ఏఐకేఎంఎస్ జిల్లా ఉపాధ్యక్షులు,
 మహేష్ డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి,
 రాములు( రజక్ ) జిల్లా కార్యదర్శి, ప్రేమ్ కుమార్ జిల్లా కమిటీ సభ్యులు,
 వేల్పుల శంకర్ ఏ ఐ కేకే  ఎస్ జిల్లానాయకులు, తదితరులు పాల్గొన్నారు