ఈ నివాస్ న్యూస్ మంథని : వెటరన్ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ (విటిటిఏ) లలాపేట ఆధ్వర్యంలో టి టి కనెక్ట్ డిజిటల్ ప్లాట్ఫారంలో మొట్ట మొదటిసారి నిర్వహించిన రాష్ట్రస్థాయి టోర్నమెంట్ లో పెద్దపల్లి జిల్లా మంథని కి చెందిన అరుంధర్ గౌడ్ విజేతగా నిలిచారు. అండర్ 40 విభాగంలో 48 మంది క్రీడాకారులు పోటీలో పాల్గొనగా తాటి అరుంధర్ గౌడ్ మొదటి స్థానంలో నిలిచారు. లలాపేట ప్రొఫెసర్ జయశంకర్ జిహెచ్ఎంసి స్టేడియంలో నిర్వహించిన ఈ పోటీలలో అనుభవజ్ఞులైన క్రీడాకారులు ఉత్సాహభరితంగా తమ నైపుణ్యాలను చాటుకున్నారు.
వెటరన్ టేబుల్ టెన్నిస్ విజేతగా అరుంధర్ గౌడ్
లోకల్ యాడ్స్
వార్తా విభాగం: తెలంగాణప్రచురణ తేదీ: 25 October 2026 02:45 PM
enivasnews.com




