ముదిరాజ్ భవనానికి ఎంపీ నిధుల నుంచి రూ.25 లక్షలు కేటాయిస్తా...
ముదిరాజ్ సింహగర్జన సభలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రకటన..
 తెలంగాణ చీఫ్ బ్యూరో (కొండపర్తి ప్రసన్నకుమార్) అక్టోబర్ 25:- ముదిరాజ్ సంఘ భవనానికి ఏం పిల్లడు నిధుల నుండి 25 లక్షలు కేటాయిస్తానని పెద్దమ్మ పెళ్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. ఆదివారం మంచిర్యాలలో నిర్వహించిన ముదిరాజ్ సింహగర్జన కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామితో కలిసి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సమాజం అభివృద్ధి, సంఘం పెండింగ్ సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానని ఎంపీ హామీ ఇచ్చారు.
మంచిర్యాల పట్టణంలో ముదిరాజ్ భవన నిర్మాణానికి తన ఎంపీ నిధుల నుంచి రూ.25 లక్షలు కేటాయిస్తానని ఎంపీ వంశీకృష్ణసభాముఖంగా ప్రకటించారు. భవనానికి సంబంధించిన స్థల కేటాయింపు అంశంపై కూడా మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి త్వరితగతిన ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని తెలిపారు.
ముదిరాజ్ సొసైటీల ఎన్నికల నిర్వహణకు కృషి చేస్తా.. 
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 4,800 ముదిరాజ్ సొసైటీలు ఉండగా, మంచిర్యాల ప్రాంతంలోనే వెయ్యికి పైగా సొసైటీలు ఉన్నాయని ఎంపీ పేర్కొన్నారు. సొసైటీలకు ఎన్నికలు త్వరగా నిర్వహించేలా సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేస్తామని, ఎన్నికలు మరియు చైర్మన్ల ఎంపిక ప్రక్రియలో ముదిరాజ్ సంఘానికి అండగా ఉంటామని తెలిపారు.ముదిరాజ్ సంఘ సభ్యులకు సంబంధించిన ఇన్సూరెన్స్ పథకాలలో కొన్ని కేసులు పెండింగ్‌లో ఉండటం, మరికొన్ని కేసుల్లో నిర్ణయాలు తీసుకోకపోవడం వంటి సమస్యలు తన దృష్టికి వచ్చాయని ఎంపీ తెలిపారు.ఇన్సూరెన్స్‌కు సంబంధించిన పెండింగ్ సమస్యలపై న్యాయబద్ధంగా పరిష్కారం లభించేలా దృష్టి సారించి ముందుకు సాగుతామని హామీ ఇచ్చారు.కాకా వెంకటస్వామిని గుర్తు చేసుకుంటూ తనను పార్లమెంట్‌కు పంపించి ఆశీర్వదించిన ముదిరాజ్ సమాజం ప్రజలకు ఎంపీ వంశీకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. వారి ఆశీర్వాదం ఎల్లప్పుడూ తనపై ఉండాలని కోరుతూ, ముదిరాజ్ సమాజం బలోపేతానికి అవసరమైన ప్రతి అంశంలో తన వంతు సహకారం అందిస్తానని స్పష్టం చేశారు.మీ సమస్యల పరిష్కారం కోసం ముందడుగు వేస్తానన్నారు. మీకు అండగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ముదిరాజ్ సమాజం అభివృద్ధికి, బలోపేతానికి కృషి చేస్తానని ఎంపీ  తెలిపారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు, కులస్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.