లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న మంత్రులు..
 తెలంగాణ చీఫ్ బ్యూరో( కొండపర్తి ప్రసన్నకుమార్) అక్టోబర్ 25 :-
జగిత్యాల జిల్లా ధర్మపురీ లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆదివారం మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, దర్శించుకున్నారు.
వారికి స్వామి వారి  ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు పూర్ణకుంభ స్వాగతం పలికి ఆశీర్వాదం అందజేశారు. అనంతరం స్వామి వార్ల తీర్థ ప్రసాదాల తో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. స్వామి వారిని దర్శించుకున్నట్లయితే సకల భోగభాగ్యాలు కలుగుతాయని వారు తెలిపారు. 2027 పుష్కరాల వరకు లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రాన్ని అంగరంగ వైభవంగా తీర్చిదిద్దుతామన్నారు. వారి వెంటనాయకులు అధికారులుకార్యకర్తలు పాల్గొన్నారు.