ధర్మపురి బస్‌స్టేషన్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రులు..
రూ. 2.57 కోట్ల అంచనా వ్యయంతో ఆధునిక సౌకర్యాల ఏర్పాటు..
 తెలంగాణ చీఫ్ బ్యూరో( కొండపర్తి ప్రసన్నకుమార్) అక్టోబర్ 25 :- జగిత్యాల జిల్లా
ధర్మపురి బస్‌స్టేషన్‌ను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసేందుకు రూ. 2.57 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఆధునీకరణ పనులకు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లు తెలిపారు. జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్‌తో కలిసి ఆదివారం శంకుస్థాపన చేశారు.
బస్‌స్టేషన్‌లో ఆధునిక సౌకర్యాలు కల్పించడంతోపాటు 
ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రాజెక్టులో భాగంగా రెండు ప్లాట్‌ఫారాల విస్తరణ, సీసీ పేవ్‌మెంట్, గ్రానైట్ ఫ్లోరింగ్, భవనానికి ఏసీపీ క్లాడింగ్, కొత్త మరుగుదొడ్ల నిర్మాణం, సెప్టిక్ ట్యాంక్ ఏర్పాటు, రూఫ్ స్లాబ్, సీలింగ్ మరమ్మతులు చేపట్టనున్నారు. అదేవిధంగా వర్షపు నీటి పారుదల వ్యవస్థ అభివృద్ధి, పెయింటింగ్, పల్లపు ప్రాంతాల్లో కంకర వేయడం, ల్యాండ్‌స్కేపింగ్, విద్యుదీకరణ, పంప్‌సెట్‌తో కూడిన బోర్‌వెల్ ఏర్పాటు చేయనున్నారు.
పుష్కరాల అభివృద్ధికి రూ. 226 కోట్లు మంజూరు చేశామన్నారు.
2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి తీరంలోని పుణ్యక్షేత్రాలు, ఘాట్లు, రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ధర్మపురి ఉగ్ర నరసింహ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి రూ. 10 కోట్లు, పుష్కర ఘాట్లు, బైపాస్ రహదారులు తదితర అభివృద్ధి పనులకు సుమారు రూ. 226 కోట్ల నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిసిసి నాయకుడు ఏలేటి చంద్ర రెడ్డి తో పాటు నియోజకవర్గ నాయకులుకార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు.

ధర్మపురి బస్‌స్టేషన్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రులు..