జోడేఘాట్లో కుమురం భీం వర్ధంతి ఏర్పాట్లను పరిశీలించిన ఆత్రం సుగుణక్క...
ఈనెల 26న జరిగే కార్యక్రమానికి హాజరుకానున్న రాష్ట్ర మంత్రులు...
తెలంగాణ చీఫ్ బ్యూరో(కొండపర్తి ప్రసన్నకుమార్) అక్టోబర్ 25 :- కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా
కెరమెరి మండలం జోడేఘాట్లో ఈనెల 26న ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనున్న కుమురం భీం వర్ధంతి కార్యక్రమ ఏర్పాట్లను డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క, ఉట్నూర్ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి మంద మకరందుతో కలిసి ఆదివారంపరిశీలించారు.వర్ధంతి కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సీతక్కహాజరుకానున్న నేపథ్యంలో సభా స్థలి ఏర్పాట్లతో పాటు కార్యక్రమ నిర్వహణకు సంబంధించిన ఇతర ఏర్పాట్లను సమీక్షించారు.వర్ధంతి కార్యక్రమానికి హాజరయ్యే ప్రజలు, ఆదివాసీల రాకపోకల సౌకర్యార్థం హట్టి గ్రామం నుంచి జోడేఘాట్ వరకు ఈనెల 26న ప్రత్యేక ఆర్టీసీ బస్సు సర్వీసులు నడవనున్నాయని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో డీటీడీఓ జాదవ్ అంబాజీ, కుంరం భీమ్ సభ నిర్వహణ కమిటీ చైర్మన్ పెందోర్ రాజేశ్వర్, సర్పంచ్ ఆత్రం లక్ష్మన్,కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుజియత్ ఖాన్, ఆర్ జి పి ఆర్ ఎస్ జిల్లా కన్వీనర్ కోవా ఇందిర తదితరులు పాల్గొన్నారు.

K Prasanna Kumar





