చెన్నూరు లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి వివేక్..
తెలంగాణ చీఫ్ బ్యూరో (కొండపర్తి ప్రసన్నకుమార్) అక్టోబర్ 26:-
చెన్నూరు పట్టణంలో రూ. 5.50 కోట్ల నిధులతో చేపట్టిన రోడ్డు విస్తరణ, సెంట్రల్ లైటింగ్, సుందరీకరణ పనులకుసోమవారంమంత్రి వివేక్ భూమిపూజ చేశారు.
రాబోయే 2027గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని మహంకాళి వాడ నుంచి నేషనల్ హైవే వరకు రూ. 3.50 కోట్లతో రోడ్డు పనులను ప్రారంభించారు.
పుష్కర ఘాట్లకు వెళ్లే భక్తులకు ఎలాంటి అసౌకర్యంకలగకుండా ప్రత్యేకంగా గోదావరి రోడ్డు పనులకు శంకుస్థాపన మంత్రి వివేక్ వెంకటస్వామి చేశారు.గోదావరి పుష్కరాల శాశ్వత మౌలిక వసతులు, ఘాట్ల విస్తరణ కోసం ప్రభుత్వ పరంగా సుమారు రూ. 70 కోట్ల నిధులు మంజూరు చేయించామని తెలిపారు.
నాణ్యతా ప్రమాణాల్లో ఎక్కడా రాజీ పడకుండా నిర్దేశిత గడువులోగా నిర్మాణ పనులు పూర్తి చేయాలని అధికారులను కాంట్రాక్టర్లను మంత్రి ఆదేశించారు.ఈ
కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంట పాల్గొన్న మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్,ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

K Prasanna Kumar





