మంచిర్యాల నడిబొడ్డులో రూ.100 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతున్నా పట్టించుకోరా...?
సర్వే నంబర్ 87 భూమిపై అక్రమ ప్రహరీ నిర్మాణాన్ని అడ్డుకోవాలి:ఎంఐఎం డిమాండ్...
తెలంగాణ చీఫ్ బ్యూరో (కొండపర్తి ప్రసన్నకుమార్) అక్టోబర్ 26:-
మంచిర్యాల పట్టణ నడిబొడ్డున ఉన్న సర్వే నంబర్ 87లోని సుమారు ఒక ఎకరం విలువైన భూమి కబ్జాకు గురవుతోందని, సుమారు రూ.100 కోట్ల విలువ ఉంటుందని పేర్కొంటూ ఎంఐఎం నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం ఎంఐఎం నాయకులు అదనపు కలెక్టర్ వి రాములకు వినతిపత్రం అందజేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూఇంత విలువైన ప్రభుత్వ భూమి వివాదంలో ఉండి, దానిపై ప్రహరీ గోడనిర్మాణప్రయత్నాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
ఈ భూమికి సంబంధించి హైకోర్టులో ఏ .స్ . నెంబర్ . 234 అఫ్ 2023 కేసు పెండింగ్లో ఉందని ఎంఐఎం నాయకులు తెలిపారు. తమకు తెలిసిన మేరకు, హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం ప్రతివాది నంబర్ 1 ఎలాంటి థర్డ్ పార్టీ హక్కులను సృష్టించరాదని, వివాదాస్పద భూమి భౌతిక స్వరూపాన్ని మార్చరాదని ఆదేశాలు ఉన్నాయని పేర్కొన్నారు.అటువంటి పరిస్థితుల్లో ప్రహరీ గోడ నిర్మాణానికి ప్రయత్నించడం ఆందోళనకరమని, కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పేదలకు ఒక న్యాయం.. ధనవంతులకు మరో న్యాయమా..?
2026 జూన్ 24న ఇదే ప్రాంతంలో జీవనోపాధి కోసం చిన్న చిన్న దుకాణాలు నిర్వహించుకుంటున్న పేద చిరు వ్యాపారుల దుకాణాలను తొలగించారని ఎంఐఎం నాయకులు గుర్తుచేశారు. దాదాపు 30 ఏళ్లుగా ఆ దుకాణాలపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాల ఉపాధి దెబ్బతిందని, సుమారు 200 మంది పోలీసుల సమక్షంలో దుకాణాల తొలగింపు జరిగిందని తెలిపారు. పేదలు రోడ్డుపై చిన్న తోపుడు బండి పెట్టినా చర్యలు తీసుకునే యంత్రాంగం, కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమి విషయంలో మాత్రం ఎందుకు మౌనం వహిస్తోందని ప్రశ్నించారు.
ఈ వ్యవహారంపై బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు కూడా స్పందించి తమ వైఖరిని స్పష్టం చేయాలని ఎంఐఎం నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూమినిపరిరక్షించాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉందని, ఎవరికి అనుకూలంగా వ్యవహరించకుండా చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు.
మంచిర్యాల జిల్లా యంత్రాంగం ప్రభుత్వ భూములను కాపాడటానికి ఉందా లేదా అని ఎంఐఎం నాయకులుప్రశ్నించారు. వివాదాస్పద భూమిపై జరుగుతున్న నిర్మాణాలపై తక్షణ విచారణ జరిపి, హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని, భూమి రికార్డులను పరిశీలించి ప్రభుత్వ భూమికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.పేదల దుకాణాలపై వేగంగా చర్యలు తీసుకునే అధికారులు, ప్రభుత్వ భూమి విషయంలోనూ అదే చట్టబద్ధమైన నిబద్ధతను చూపాలన్నారు. ప్రభుత్వ భూమిని కాపాడటం ప్రజాప్రయోజనం దీనిపై నిర్లక్ష్యాన్ని సహించేది లేదు” అని ఎంఐఎం నాయకులు స్పష్టం చేశారు.
మంచిర్యాల నడిబొడ్డులో రూ.100 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతున్నా పట్టించుకోరా...?
సర్వే నంబర్ 87 భూమిపై అక్రమ ప్రహరీ నిర్మాణాన్ని అడ్డుకోవాలి:ఎంఐఎం డిమాండ్...
లోకల్ యాడ్స్
వార్తా విభాగం: తెలంగాణప్రచురణ తేదీ: 26 October 2026 04:52 PM
K Prasanna Kumar




