ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల క్షేత్ర పర్యటన..

 తెలంగాణ చీఫ్ బ్యూరో (కొండపర్తి ప్రసన్నకుమార్) : మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేట ప్రభుత్వ ఆదర్శ డిగ్రీ కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యంలో శనివారంవిద్యార్థులు క్షేత్రపర్యటనలో భాగంగా జగిత్యాల జిల్లాధర్మపరి లక్ష్మీ నరసింహ ఆలయాన్ని వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రిన్సిపాల్ డా, మహాత్మా సంతోష్ ఆదేశాల ప్రకారం అనుభవ పూర్వక అభ్యాసంలో భాగంగా కార్యక్రమ కన్వీనర్ డా. తన్నీరు సురేష్ సారధ్యంలోవిద్యార్థులు ధర్మపురిలోని శ్రీలక్మీ నరసింహ స్వామి ఆలయం మరియు కాకతీయుల కాలం నాటి శ్రీరామలింగేశ్వర ఆలయం, బ్రహ్మపుష్కరిణి, సత్యవతీ, శ్రీ వేంకటేశ్వర ఆలయాలను సందర్శించి అక్కడి ఆధ్యాత్మిక చారిత్రక విశేషాలను తెలుసు కున్నారు. ధర్మపురి ఆలయ ఈ ఓ. శ్రీనివాస్ మరియు ఆలయ సిబ్బంది, పూజారులు కలిసి విద్యార్థులకు ధర్మపురి వైభవాన్ని వివరించారు.

ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల క్షేత్ర పర్యటన..

చివరలో ధర్మపురిలో శ్రీ లక్ష్మి నరసింహ రైస్ మిల్ ని సందర్శించి రైస్ మిల్ వ్యాపార వేత్త గునిశెట్టి రవీందర్ నుండి వ్యాపార నిర్వహణపై మెళకువలు నేర్చుకున్నారు. బిజినెస్ రంగంలో నిలబడటానికి ఆధ్యాత్మిక వాతావరణానికి సమాజానికి గల సంబంధాలను ఈ సందర్బంగా విద్యార్థులు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డా. తన్నీరు సురేష్ , కవిత, ప్రణవ్ పాల్గొన్నారు.

ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల క్షేత్ర పర్యటన..