తెలంగాణ చీఫ్ బ్యూరో (కొండపర్తి ప్రసన్నకుమార్) : ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు భద్రపరిచిన గోదాము వద్ద పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టడం జరుగుతుందని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు తెలిపారు . మంగళవారం మంచిర్యాల జిల్లాలోని నస్పూర్ లో గల ఈ వి ఎం గోదామును ఎన్నికల విభాగం అధికారులతో కలిసి సందర్శించి బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల గోదాము వద్ద పోలీసు సిబ్బంది సమన్వయంతో పటిష్టమైన బందోబస్తు చేపట్టడంతో పాటు 24 గంటలు సి.సి. కెమెరాల ద్వారా పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు. భద్రత సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల విభాగం అధికారులు, సంబంధితఅధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఈ వి ఎం గోదాము వద్ద పటిష్టమైన బందోబస్తు చర్యలు..! అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు..
లోకల్ యాడ్స్
వార్తా విభాగం: తెలంగాణప్రచురణ తేదీ: 06 October 2026 09:58 PM
enivasnews.com




