తెలంగాణ చీఫ్ బ్యూరో (కొండపర్తి ప్రసన్నకుమార్ ) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలోని గెర్జామ్ గ్రామంలో మంగళవారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రజలను కలుసుకుని స్థానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులు, ప్రజలకు ఎదురవుతున్న సమస్యలపై స్థానికులతో చర్చించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన 50 మంది యువకులు మహిళలు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ గెర్జామ్ గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. గ్రామ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనతో పాటు పెండింగ్‌లో ఉన్న సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. గ్రామస్తులు పలు సమస్యలను తెలిపారు కచ్చితంగా ప్రతీ సమస్యకు పరిష్కారం చూపుతానని భరోసా కల్పించారు. గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి త్వరలోనే నిధులు మంజూరు చేస్తా అదేవిధంగా గ్రావెల్ రోడ్లు కావాలని కోరారు కచ్చితంగా త్వరలోనే వాటిని మంజూరు చేస్తామన్నారు. బీఆర్ఎస్ పార్టీపై నమ్మకంతో యువత పెద్ద సంఖ్యలో పార్టీలో చేరడం సంతోషకరమని, పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత గౌరవం కల్పిస్తూ ప్రజా సమస్యల పరిష్కారంలో కలిసి పనిచేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యువకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.