తెలంగాణ చీఫ్ బ్యూరో ( కొండపర్తి ప్రసన్నకుమార్) : మార్చ్ 16/03/2023సంవత్సరంలో ఆదిలాబాద్ నుండి ఖమ్మం వరకు చేపట్టినపీపుల్స్ మార్చ్ పాదయాత్ర 100వ రోజు,పూర్తయన సందర్బంగా మంగళవారం నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం కేతేపల్లి మండలం ఉప్పలపహాడ్ గ్రామంలో కేక్ కట్ కట్ చేశారు. అనంతరం పార్టీ చేస్తున్న అభివృద్ధిపై ప్రజలకు వివరించారు నాయకులు కార్యకర్తలు రాబోయే రోజుల్లో కూడా ఐకమత్యమే ఉండి పార్టీని గెలిపించడానికి శ్రమించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి సతీమణి అమ్మ పౌండేషన్ ఛైర్మన్ నందిని విక్రమార్క మల్లుతో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ యువనేత కల్తి వెంకట్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.