రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, టి.పి.సి.సి. ప్రధాన కార్యదర్శి దుద్దిల్ల శ్రీను బాబుల ఆశీస్సులతో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యదర్శిగా నూతన బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆరెల్లి కిరణ్ గౌడ్ ను కాంగ్రెస్ పార్టీ DSB సోషల్ మీడియా టీం సభ్యులు శాలువాతో సత్కరించి, మిఠాయి పంచి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా సభ్యులు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు సముచిత గుర్తింపు, బాధ్యతలు లభిస్తాయని, ఆరెల్లి కిరణ్ గౌడ్‌కు రాష్ట్ర సోషల్ మీడియా కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించడం అందుకు నిదర్శనమని అన్నారు. అనంతరం ఆరెల్లి కిరణ్ గౌడ్ మాట్లాడుతూ తనను అభినందించిన సోషల్ మీడియా టీం సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. తనపై చూపిస్తున్న ప్రేమానురాగాలు, ఆశీస్సులు, దీవెనలు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని కోరారు. ఆరెల్లి కిరణ్ గౌడ్ రాష్ట్ర సోషల్ మీడియా కార్యదర్శిగా నూతన బాధ్యతలు స్వీకరించడంతో స్థానిక నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా సభ్యులు పంచిక దేవేందర్, రేపాక శ్రీకాంత్, అరుణ్, బూడిద రమేష్ తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి ఆరెల్లి కిరణ్ గౌడ్ ను సన్మానించిన DSB సోషల్ మీడియా టీం