తెలంగాణ చీఫ్ బ్యూరో (కొండపర్తి ప్రసన్నకుమార్) : తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ పండుగ పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 1.05 కోట్ల మంది మహిళలకు 'ఇందిరా మహిళా శక్తి' చీరలను పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. సిరిసిల్లతో పాటు పలు ప్రాంతాల్లో నేతన్నలు ఈ చీరల తయారీని వేగంగా పూర్తి చేస్తున్నారు. ఈసారి ఈ చీరలు ఆకర్షణీయమైన చిలుక పచ్చ రంగులో అందరికీ అందుబాటులోకి రానున్నాయి. దీంతో ప్రతియేట ప్రభుత్వం ఆడబిడ్డలకు పండగ ఇచ్చే కానుక త్వరలో అందనుంది. దీంతో మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
బతుకమ్మ పండుగ కానుక..మహిళలకు 'ఇందిరా మహిళా శక్తి' చీరల పంపిణీ..
లోకల్ యాడ్స్
వార్తా విభాగం: తెలంగాణప్రచురణ తేదీ: 09 October 2026 12:00 AM
enivasnews.com




