తెలంగాణ (చీఫ్ బ్యూరో కొండపర్తి ప్రసన్నకుమార్) 8 : లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని వరుసగా రెండోసారి అరెస్టు చేయడాన్ని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) తీవ్రంగా ఖండిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.దేశ ప్రజలు బీజేపీ ప్రభుత్వ వైఖరిని గమనిస్తున్నారని, మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి రాజకీయంగా రోజులు దగ్గరపడ్డాయని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే “చలో రాజ్‌భవన్” నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉన్న అన్ని వర్గాల ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమం నెక్లెస్ రోడ్ నుంచి రాజ్‌భవన్ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు.
తెలంగాణలో కాంగ్రెస్ భారీ ఆందోళనకు పిలుపు..
లోకల్ యాడ్స్
వార్తా విభాగం: తెలంగాణప్రచురణ తేదీ: 09 October 2026 12:04 AM
enivasnews.com




