తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ వేడుకలు..
అధికారిక గుర్తింపునిచ్చిన ఘనత కెసిఆర్ దే..
మాజీ మంత్రిజగదీష్ రెడ్డి...
తెలంగాణ చీఫ్ బ్యూరో (కొండపర్తి ప్రసన్నకుమార్) అక్టోబర్ 9 :- తెలంగాణ సాంస్కృతి సంప్రదాయాలకు బతుకమ్మ వేడుకలను దర్శనమని, బతుకమ్మ వేడుకలకు ప్రాధాన్యత ఇచ్చింది కేసీఆర్ మాత్రమేనని
మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన బతుకమ్మ పండుగ సందర్బంగా ఆడపడుచులందరికీ మాజీ మంత్రివర్యులు, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డిప్రత్యేకశుభాకాంక్షలు తెలిపారు. శనివారం పితృ అమావాస్యతో ప్రారంభమయ్యే బతుకమ్మ ఉత్సవాలతో పాటు ఆదివారం నుంచి ప్రారంభమయ్యే దేవి శరన్నవరాత్రోత్సవాలు ఐక్యతతో, ప్రశాంతవాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. ఎక్కడా లేనివిదంగా ప్రకృతిని ఆరాధిస్తూ జరుపుకునే బతుకమ్మ తెలంగాణ ఉద్యమంతో ఖండాంతరాలకు విస్తరించిందని తెలిపారు. పోరాడి సాధించినతెలంగాణలో బతుకమ్మ పండుగకు ప్రత్యేక గుర్తింపునిచ్చి అధికారికంగా నిర్వహింకునేలా చేసిన ఘనత ఆనాటి మన ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందన్నారు. ఆనాటి నుంచే బతుకమ్మపర్వదినాన్ని అధికారికంగా జరుపుకుంటున్నామన్నారు. ఎంగిలి పువ్వు తో ప్రారంభమయ్యే బతుకమ్మ, దేవీ నవరాత్రుల పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ప్రజలందరికీ ఆయన బతుకమ్మ, దేవీ శరన్నవరాత్రోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
K Prasanna Kumar





