రాష్ట్రపతిని కలిసి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాటం చేస్తాం..ప్రియాంక గాంధీతో కలిసి సమావేశమైన ఎంపీ గడ్డం వంశీకృష్ణ, కాంగ్రెస్ ఎంపీలు..ప్రియాంక గాంధీతో కలిసి సమావేశమైన ఎంపీ గడ్డం వంశీకృష్ణ, కాంగ్రెస్ ఎంపీలు..
తెలంగాణ చీఫ్ బ్యూరో( కొండపర్తి ప్రసన్నకుమార్) అక్టోబర్ 10:- ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాష్ట్రపతిని కలిసి నిరంతర పోరాటం చేస్తామని పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణతో పాటు కాంగ్రెస్ ఎంపీలు స్పష్టం చేశారు. శుక్రవారం ఢిల్లీలోకాంగ్రెస్ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ, ప్రజల ఓటు హక్కుల రక్షణ లక్ష్యంగా రాష్ట్రపతిని కలిసి తమ గళాన్ని వినిపించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై ఎంపీలు చర్చించారు.ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు, ప్రజల ఓటు హక్కులను పరిరక్షించేందుకు రాష్ట్రపతిని కలిసి తమ నిరసనను తెలియజేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం అన్నారు.ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ, ప్రజల హక్కుల రక్షణ వంటి అంశాలపై కాంగ్రెస్ పార్టీ తన పోరాటాన్ని కొనసాగిస్తోంది.ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ ఎంపీలంతా ఐక్యంగా ముందుకు సాగుతూ, ప్రజల హక్కుల కోసం తమ పోరాటాన్ని కొనసాగించాలని నిర్ణయించారు.
K Prasanna Kumar





