ఆత్మకూరు :- కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "రాయలసీమ-హార్టికల్చర్ హబ్"ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీశైలం శాసనసభ్యులు బుడ్డా రాజశేఖరరెడ్డి ఆదేశాలతో ఈరోజు ఆత్మకూరు పట్టణంలో ఆత్మకూరు హార్టికల్చర్ క్లస్టర్-సమగ్ర అభివృద్ధి ప్రణాళిక" అను రైతు అవగాహన సదస్సు హార్టికల్చర్ అధికారిణి కె.చందన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సింగిల్ విండో చైర్మన్ ఏ.షహాబుద్దిన్, తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు వేణుగోపాల్ తో కలిసి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి సింగిల్ విండో చైర్మన్ ఏ.షహాబుద్దీన్ మాట్లాడుతూ రైతులు ఉద్యాన పంటలకు అలవాటు పడితే సబ్సిడీలతో పాటు అధిక లాభాలు పొందే అవకాశం ఉందన్నారు. మన భవిష్యత్తు నాయకులు ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ యువ గళం పాదయాత్ర సందర్భంగా మన రాయలసీమ రైతుల ఇబ్బందులను గ్రహించి ఆనాడు ఇచ్చిన మాట ప్రకారం గాంధీ జయంతి నాడు రాయలసీమ-హార్టికల్చర్ హబ్ ను మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ల చేతుల మీదుగా ప్రారంభించడం చాలా సంతోషకరమన్నారు. అదే విధంగా అగ్రికల్చర్ ఏడి హేమలత మాట్లాడుతూ ఎల్లీనో ప్రభావం వలన రబి పంటలు పండించే రైతులు క్రాప్ హాలిడే ప్రకటించాలని లేని పక్షంలో అవకాశం ఉన్నచోట నీటి సామర్థ్యం బట్టి పంటలు సాగు చేయాలన్నారు. మన భవిష్యత్తు కొరకు ప్రతి ఒక్కరూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు చేపట్టే నీరు -చెట్టు కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలన్నారు. హార్టికల్చర్ అధికారిణి కె.చందన మాట్లాడుతూ ఉద్యాన పంటల వలన రైతులకు వచ్చే సబ్సిడీ ల గురించి, పంట లాభాలు మరియు ఎగుమతుల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి ఏఓ అమీరున్నిసా ,రైతు సంఘం నాయకులు అష్రఫ్ అలీ, మండల ప్రధాన కార్యదర్శి అబ్దుల్ నబి, అగ్రికల్చర్ మరియు హార్టికల్చర్ సిబ్బంది, అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.
ఉద్యానవన పంటల సాగుతో రైతులకు అధిక లాభాలు
ఆత్మకూర్ సింగిల్ విండో చైర్మన్ ఏ షహబుద్దీన్
లోకల్ యాడ్స్
వార్తా విభాగం: ఆంధ్రప్రదేశ్ప్రచురణ తేదీ: 02 October 2026 05:17 PM
enivasnews.com




