నంద్యాల/పాములపాడు : ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ (ఏపీఓఎస్ఎస్) ఆధ్వర్యంలో ఓపెన్ 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ కోర్సుల్లో చేరేందుకు ప్రవేశాలు ప్రారంభమయ్యాయని, కనుక ఆసక్తి ఉన్నవారు దరఖాస్తులు చేసుకోవాలని పాములపాడులోని, శ్రీ వివేకానంద విద్యా విహార్ హైస్కూల్ కరెస్పాండెంట్ & యజమాన్యం ఆర్ ఎస్ ఆర్.గోపాల్ విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ వివేకానంద విద్యాహ్యా విహార్ హై స్కూల్ కారస్పాండెంట్ ఆర్ఎస్ఆర్. గోపాల్ మాట్లాడుతూ చదువు మధ్యలో ఆపేసిన వారికి, క్రమబద్ధమైన విద్య నభ్యసించలేకపోయిన వారికి ఇది ఒక సువర్ణ అవకాశమని పాఠశాల యాజమాన్యం పేర్కొంది. ఓపెన్ 10వ తరగతికి ఎలాంటి పూర్వ విద్యా అర్హత లేకపోయినా ప్రవేశం పొందవచ్చని తెలిపారు. వయోపరిమితి 14 సంవత్సరాలు నిండిన వారు ఎవరైనా అర్హులేనని పేర్కొన్నారు. ఓపెన్ ఇంటర్మీడియట్ ప్రవేశానికి 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులు అని అన్నారు. గ్రూపులు సిఈసి మరియు హెచ్ఈసి గ్రూపులలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోచ్చని వెల్లడించారు. ఉన్నత చదువులకు, ఉద్యోగ అవకాశాలకు ఈ కోర్సులు ఉపయుక్తంగా ఉంటాయని తెలిపారు. ఆసక్తి ఉన్నవారు పాములపాడు లోని, తహాసిల్దార్ కార్యాలయం రాస్తాలో ఉన్న శ్రీ వివేకానంద విద్యా విహార్ హైస్కూల్ నందు తమ పేర్లను నమోదు చేసుకోవాల్సిందిగా కోరారు. మరిన్ని వివరాలకు 9392115035 నెంబర్ కు ఫోన్ చేసి కనుక్కోవచ్చు అన్నారు.
పాములపాడు శ్రీ వివేకానంద విద్యా విహార్ హైస్కూల్లో ఓపెన్ టెన్త్, ఇంటర్మీడియట్ ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోండి..! ఆర్ఎస్ఆర్.గోపాల్ (కరస్పాండెంట్)
లోకల్ యాడ్స్
వార్తా విభాగం: ఆంధ్రప్రదేశ్ప్రచురణ తేదీ: 07 October 2026 06:41 PM
enivasnews.com




