నంద్యాల/పాములపాడు : బీజేపీ కేంద్ర, రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు, నంద్యాల జిల్లా అధ్యక్షులు డాక్టర్ అభిరుచి మధు గారి సూచనల మేరకు సమావేశం నిర్వహించారు. మండల అధ్యక్షులు రాయపాటి మురళీమోహన్ అధ్యక్షతన బీజేపీ మండల పదాధికారుల సమావేశం జరిగింది. సమావేశానికి మండల ఇన్చార్జ్, సీనియర్ నాయకులు, బీఎల్ఓ-2 దామోదర్ రెడ్డి హాజరై పలు సూచనలు చేశారు. మండలంలోని ప్రజా సమస్యలు, గ్రామాల వారీ సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై చర్చించారు. బీజేపీ కార్యకర్తల సమస్యలు, సంక్షేమం, అభివృద్ధి అంశాలపై సమీక్ష నిర్వహించారు. మండలంలో పార్టీ సంస్థాగత పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఎస్ ఐ ఆర్, స్థానిక సంస్థల ఎన్నికలు తదితర అంశాలపై పదాధికారులకు సూచనలు చేశారు.

ఈ నెలలో నిర్వహించాల్సిన పార్టీ కార్యక్రమాలపై కార్యాచరణ రూపొందించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కార్యకర్తలు క్షేత్రస్థాయిలో చురుకుగా పనిచేయాలని సూచించారు. పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. సమావేశంలో ప్రవీణ్ కుమార్, గోపాలకృష్ణయ్య, రేణుక, మంగళి వెంకటేశ్వర్లు, జూటూరు వెంకటేశ్వర్లు, ఆంజనేయులు, బాలస్వామి, ఏసన్న, లింగాల బ్రహ్మయ్య, రుద్రవరం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

enivasnews.com





