నద్యాల/పాములపాడు:- భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని, ఆయన ప్రజా జీవితంలో 25 సంవత్సరాల సేవా ప్రస్థానాన్ని స్మరించుకుంటూ చేపట్టిన “సేవా సంకల్ప అభియాన్ లో భాగంగా బీజేపీ ఆధ్వర్యంలో “అంగన్వాడి మిలన్ సేవా కల” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. బీజేపీ పాములపాడు మండల అధ్యక్షులు రాయపాటి మురళీమోహన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాములపాడు మండలంలోని, పాములపాడు, ఇస్కాల, లింగాల, తుమ్మలూరు, జూటూరు గ్రామాల్లో ఎన్నో సంవత్సరాలుగా సేవలందిస్తున్న అంగన్వాడి టీచర్లను, హెల్పర్లను గౌరవిస్తూ శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు.  అంగన్‌వాడీ కేంద్రాల్లోని, చిన్నారులకు పండ్లు, బిస్కెట్లు మరియు పోషకాహారాన్ని పంపిణీ చేస్తారు. చిన్నారులకు పౌష్టికాహారం, ఆరోగ్యం, విద్య అందించడంతో పాటు వారి ఉజ్వల భవిష్యత్తుకు అంగన్వాడి కార్యకర్తలు, హెల్పర్లు చేస్తున్న సేవలు అభినందనీయమని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు, చిన్నారుల సంక్షేమానికి అంగన్వాడి సిబ్బంది అందిస్తున్న సేవలను గుర్తించి వారిని సన్మానించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు చల్లా దామోదర్ రెడ్డి, మండల పదాధికారులు ప్రవీణ్ కుమార్, గోపాలకృష్ణయ్య, రేణుక, మంగళి వెంకటేశ్వర్లు, జూటూరు వెంకటేశ్వర్లు, ఆంజనేయులు, బాలస్వామి, ఏసన్న, లింగాల బ్రహ్మయ్య, రుద్రవరం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

అంగన్వాడి కేంద్రాలలో "మిలన్ సేవా కల" కార్యక్రమం..! బిజెపి ఆధ్వర్యంలో అంగన్వాడి సిబ్బందికి ఘనంగా సన్మానాలు