నంద్యాల/ఆత్మకూరు : ఆత్మకూరు పట్టణంలోని, 15వ అంగన్వాడి సెంటర్ నందు ఐసిడిఎస్ సూపర్వైజర్ కోమలమ్మ, టీచర్ మంజులమ్మ ల ఆధ్వర్యంలో నిర్వహించిన అంగన్వాడి ఉత్సవ్ మరియు పోషణ మాసం"అనే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆత్మకూరు సింగిల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్ మాట్లాడుతూ పిల్లలకు తల్లి పాత్ర తర్వాత సంరక్షణ చూసుకునేది అంగన్వాడి టీచర్లు మరియు సహాయకులు అని అన్నారు. ప్రభుత్వం శిశు మరణాలను తగ్గించడానికి పిల్లలకు, గర్భవతులకు, బాలింతలకు మంచి పోషక ఆహారం అందిస్తుందన్నారు. అదేవిధంగా ఐసిడిఎస్ సూపర్వైజర్ కోమలమ్మ మాట్లాడుతూ పిల్లలకు మరియు గర్భిణీ స్త్రీలకు ప్రభుత్వం మంచి చదువుతో పాటు సంరక్షణలో భాగంగా అనేక రకాలుగా పోషణ సంబంధించిన నాణ్యత మైన సరుకులను ఇస్తుందని, వీటిని ప్రజలు వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అజిమహిద్దిన్, టీచర్ విజయలక్ష్మి, సహాయకురాలు షమీవున్ మరియు అధిక సంఖ్యలో ముస్లిం మహిళలు పాల్గొన్నారు.
తల్లి తర్వాత పిల్లల సంరక్షణ చూసుకునేది అంగన్వాడి టీచర్లు, సహాయకులే..! సింగిల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్
లోకల్ యాడ్స్
వార్తా విభాగం: ఆంధ్రప్రదేశ్ప్రచురణ తేదీ: 06 October 2026 10:24 PM
enivasnews.com




